Share News

యూరియా కొరతతో రైతులు అల్లాడుతున్నారు?

ABN , Publish Date - Aug 09 , 2025 | 11:17 PM

యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని, మండలానికి యూరియా కేటాయింపులో పక్షపాత ధోరణి దారుణమని పలు వురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు.

  యూరియా కొరతతో రైతులు అల్లాడుతున్నారు?
ఎరువుల కేటాయింపులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పోలినాయుడు

కేటాయింపులో పక్షపాత ధోరణి తగదు

మండల సమావేశంలో సభ్యుల ఆవేదన

పొందూరు, ఆగష్టు 9(ఆంధ్రజ్యోతి): యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని, మండలానికి యూరియా కేటాయింపులో పక్షపాత ధోరణి దారుణమని పలు వురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కిల్లి ఉషారాణి అధ్యక్షతన శనివారం మండల సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా పిల్లలవలస, తుంగపేట సర్పంచ్‌లు బుడుమూరు పోలినాయుడు, వేణుగోపాలరావు మాట్లాడుతూ.. జిల్లాలో ఏ మండలానికి రాని ఎరువులు, యూరియా కొరత పొందూరు మండలానికే ఎందుకు వచ్చిందని, దీనికి మంత్రి అచ్చె న్నాయు డు, వ్యవసాయాధికారులే కారణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికీ మండ లంలో కొన్ని గ్రామాలకు యూరియా కేటాయించలేదన్నారు. కొన్ని నియోజక వర్గాలకు మందల లోడ్ల ఎరువులు కేటా యించిన అధికారులు పొందూరుకు చాలీ చాలని కేటాయింపులు ఎందుకు చేశారని ఏవో శ్రీనివాసరావును ప్రశ్నించారు. ఎరువుల కొరతపై ప్రశ్ని స్తున్న రైతులకు మేం ఏం సమాధానం చెబుతామని టీడీపీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు మండిపడ్డారు. మండలంలో ఎరువు ల కొరత సృష్టించడంపై జిల్లా యంత్రాంగంపై రాష్ట్ర ప్రభు త్వానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఎరువుల పంపిణీపై నిర్లక్ష్యం ప్రద ర్శించిన సచివాలయ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌లపై ఏం చర్య లు తీసుకున్నారని ఏవోను ప్రశ్నించారు. సమావేశంలో తహ సీల్దార్‌ వెంకటేష్‌, ఎంపీడీవో మన్మఽథరావు, పలువురు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. పీఏసీఎస్‌ చైర్మన్‌గా నియమితులైన మండల ప్రత్యేక ఆహ్వానితుడు వండాన మురళిని అధికారులు, మండల పరిషత్‌ సభ్యులు సత్కరించారు.

Updated Date - Aug 09 , 2025 | 11:17 PM