Share News

అర్జీలు పునరావృతం కాకూడదు

ABN , Publish Date - Aug 11 , 2025 | 11:38 PM

ప్రజా గ్రీవెన్స్‌ లో స్వీకరిస్తున్న వినతులు పునరావృతం కాకుండా క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు.

అర్జీలు పునరావృతం కాకూడదు
అర్జీలను స్వీకరిస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ప్రజా గ్రీవెన్స్‌ లో స్వీకరిస్తున్న వినతులు పునరావృతం కాకుండా క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సోమ వారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరి ష్కార వేదికను నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 43 మంది నుంచి వినతులను స్వీకరించి వారితో స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సమస్యలపై చట్ట ప్రకారం విచారణ చేసి సత్వర న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. ఆయా పోలీస్‌ స్టేషన్‌ అధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశిం చారు. కార్యక్రమంలో భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, మోసపూరితమైన, ఆస్తి తగాదాలు, కొట్లాట, ఇతర సమస్య లపై ఫిర్యాదులు స్వీకరించారు.

Updated Date - Aug 11 , 2025 | 11:38 PM