కువైట్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..
ABN , Publish Date - Jul 05 , 2025 | 12:25 AM
కువైట్ దేశంలో నిర్మాణ రంగంలో ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఉరిటి సాయికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కువైట్ దేశంలో నిర్మాణ రంగంలో ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఉరిటి సాయికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, జూలై 4(ఆంధ్రజ్యోతి): కువైట్ దేశంలో నిర్మాణ రంగంలో ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఉరిటి సాయికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సిరామిక్ ఫ్లోరింగ్, ఎలక్ట్రికల్, సీలింగ్, పెయింటింగ్ పనుల కోసం ఐటీఐ, డిప్లొమా అర్హత కలిగి, మూడు నుంచి ఐదేళ్ల అనుభవంతో పాటు హిందీ, ఇంగ్లీషు మాట్లాడగలిగే 25 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల పురుషులు అర్హులన్నారు. సూపర్‌వైజర్ ఉద్యోగానికి ఎంపికైనవారికి నెలకు రూ.70000, వర్కర్ ఉద్యోగానికి రూ.56,000 వేతనంతో పాటు ఉచిత వసతి, వైద్య సదుపాయం, రవాణా సౌకర్యం, వీసా ప్రాసెసింగ్‌తో పాటు స్వదేశానికి ఒకసారి వచ్చి పోవడానికి టిక్కెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. డ్రైవింగ్ లైసెన్సు, పాస్‌పోర్టు, పని అనుభవం, విద్యార్హత ఽధ్రువపత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. అభ్యర్థులు తమ బయోడేటాను స్కిల్ ఇంట ర్నేషనల్ ఎల్‌దిరేటాఫ్ ఏపీఎస్‌ఎస్డీసీ.ఇన్‌కు ఈ నెల 12వ తేదీ లోగా పంపాలన్నారు. వివరాలకు 988853335, 8712655686, 8790118349, 8790117279 నెంబర్లలో సంప్రదించాలన్నారు.