AP Deputy Speaker Raghurama Krishnam Raju ఆదిత్యున్ని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ స్పీకర్
ABN , Publish Date - Apr 29 , 2025 | 10:47 PM
AP Deputy Speaker Raghurama Krishnam Raju: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, గురజాల ఎమ్మెల్యే జగన్ మోహన్ మంగళవారం సాయంత్రం దర్శించుకున్నారు.
అరసవల్లి/గార, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): అరసవల్లి సూర్యనారాయణ స్వామిని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, గురజాల ఎమ్మెల్యే జగన్ మోహన్ మంగళవారం సాయంత్రం దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఆలయ ఈవో భద్రజీ స్వాగతం పలికారు. అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం వారికి స్వామివారి ప్రసాదాలను, జ్ఞాపికలను ఆలయ ఈవో అందజేశారు. అలాగే, గార మండలం శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాఽథుని కూడా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో కె.నరసింహనాయుడు, ప్రధాన అర్చకులు సీతారామ నరసింహాచార్యులు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.