‘రామేశ్వరం’ ప్రమాదంలో మరో వ్యక్తి మృతి
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:21 AM
పలాస మండలం వీరరామచంద్రాపురం, పెదంచలకు చెందిన అయ్యప్ప భక్తులు గతనెల 26న శబరి మలకు వెళ్లి తిరిగి వస్తుండగా.. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడి కక్కడే ఇద్దరు మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే.
నాలుగుకు చేరిన మృతుల సంఖ్య
పలాసరూరల్, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): పలాస మండలం వీరరామచంద్రాపురం, పెదంచలకు చెందిన అయ్యప్ప భక్తులు గతనెల 26న శబరి మలకు వెళ్లి తిరిగి వస్తుండగా.. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడి కక్కడే ఇద్దరు మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. ఈ ఘటనలో ఈ నెల 1న మధురై ఆసు పత్రిలో చికిత్స పొందుతూ గుంట రాజు మృతి చెం దగా.. గురువారం రాత్రి పైడి తారకేశ్వరరావు కూ డా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆ ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. తారకేశ్వరరావు మృతితో వీరరామచంద్ర పురం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. దీంతో ఈ ప్రమాదంలో వీరరామచంద్రాపురం గ్రామానికి చెందిన ముగ్గురు, పెదంచల గ్రామానికి చెందిన ఒకరు మృతి చెందాడు. కాగా తారకేశ్వరరావు మృతదేహం శుక్రవారం స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.