Industries: ‘మూలపేట’లో మరో పరిశ్రమ
ABN , Publish Date - May 29 , 2025 | 12:05 AM
New Industry in Moolapeta సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు సమీపంలో మరో పరిశ్రమ ఏర్పాటు కానుంది. 200 ఎకరాల్లో రూ.2వేల కోట్లతో యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)కు చెందిన యాన్నా కంపెనీ గ్రీన్ అమ్మోనియా తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది.
రూ.2వేల కోట్లతో ‘గ్రీన్ అమ్మోనియా’
టెక్కలి, మే 28(ఆంధ్రజ్యోతి): సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు సమీపంలో మరో పరిశ్రమ ఏర్పాటు కానుంది. 200 ఎకరాల్లో రూ.2వేల కోట్లతో యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)కు చెందిన యాన్నా కంపెనీ గ్రీన్ అమ్మోనియా తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు అవసరమైన స్థలాన్ని సంస్థ ప్రతినిధులు, అధికారులు బుధవారం పరిశీలించారు. పోర్టుకు ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న భూములు, ఉప్పు భూములను ఆర్డీవో కృష్ణమూర్తి, ఏపీ మారిటైం బోర్డు ఏఈ భానూజీ, యాన్నా సంస్థ ప్రతినిధులు పరిశీలించారు. ఈ పరిశ్రమ స్థాపనకు అవసరమైన విద్యుత్‌ను తామే గ్రీన్ ఎనర్జీ ద్వారా తయారు చేసుకుంటామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అలాగే సముద్రం నుంచి అవసరమైన సాల్ట్‌వాటర్‌ను పైపులైన్ ద్వారా వినియోగించుకుంటామన్నారు. ఇక్కడ తయారైన గ్రీన్ అమ్మోనియా లిక్విడ్ హ్యాండ్లింగ్ కార్గో షిప్ ద్వారా ఇతర దేశాలకు పంపిణీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ పరిశ్రమ వలన ఎటువంటి దుష్ఫలితాలు ఉండవని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.