Share News

అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు

ABN , Publish Date - Dec 23 , 2025 | 12:15 AM

అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణాలకు కృషిచేస్తానని ప్రభుత్వ విప్‌, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తెలిపారు. సోమవారం మండపల్లిలో అంగన్‌వాడీ కేంద్ర భవనాన్ని ప్రారంభించారు.

అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు
మాట్లాడుతున్న అశోక్‌ :

ఇచ్ఛాపురం, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి):అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణాలకు కృషిచేస్తానని ప్రభుత్వ విప్‌, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తెలిపారు. సోమవారం మండపల్లిలో అంగన్‌వాడీ కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీడీపీవో రాజేశ్వరి అధ్యక్షతన జరిగిన సమా వేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రోటోకాల్‌ పేరిట అధికారులను బెదిరి స్తున్న సర్పంచ్‌ వైసీపీపాలనలో ఐదేళ్లలో ఎప్పుడైనా ప్రో టాకాల్‌ పాటించారా అని ప్రశ్నించారు. పంచాయతీలో 88 లక్షల రూపాయలు దుర్వినియోగం కావడంతో ఇద్దరు సెక్రటరీలను సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. పనులు చేయకుండా చేసినట్లు బిల్లులు తీసుకోవడంతో పక్క మండలానికి చెందిన ఇద్దరు సెక్రటరీలను షోకాజ్‌ నోటీ సులు ఇచ్చినట్లు చెప్పారు. భీమసముద్రం గెడ్డపై బ్రిడ్జి పనులు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. బుడ్డెపుపేటలోలో అంగన్‌వాడీ భవనాన్ని పూర్తిచేస్తానని ఎంపీటీసీ సభ్యుడు పాతిర్ల చంద్రశేఖరరెడ్డి ప్రకటించ డంతో ఎమ్మెల్యే అభినందించారు. మండపల్లి పంచాయతీ పరిధిలో గల బుడ్డెపుపేటను మరో పంచాయతీగా ఏర్పాటుచేయడానికి తీర్మానం అడిగితే వైసీపీకి చెందిన సర్పంచ్‌ తాను అడిగిన బిల్లులను చెల్లిస్తే తీర్మానం ఇస్తానని పేర్కొనడం దౌర్బాగ్యమైన పరిస్థితికి నిదర్శన మన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రభాకరరావు, డీటీ సంతోష్‌, రెడ్డిక కార్పొరేషన్‌ చైర్మన్‌ కొండా శంకరరెడ్డి, పీఏసీఎస్‌ అధ్యక్షుడు పెదిని బాబ్జీ, పద్మనాభం, కామేష్‌, ఢిల్లీరావు,సూర్యనారాయణ, చంద్రశేఖర్‌రెడ్డి, సహదేవ్‌రెడ్డి, గోపి, కృష్ణ, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 12:15 AM