Share News

రైలు ఢీకొని గుర్తుతెలియని యువకుడి మృతి

ABN , Publish Date - Dec 23 , 2025 | 12:45 AM

పూండి-పలాస రైల్వే స్టేషన్‌ మధ్యలో సోమవారం రైలు ఢీకొని గుర్తుతెలియని యువకుడు మృతి చెందినట్టు పలాస జీఆర్‌పీ రైల్వే ఎస్‌ఐ ఎ.కోటేశ్వర రావు తెలిపారు.

రైలు ఢీకొని గుర్తుతెలియని యువకుడి మృతి

వజ్రపుకొత్తూరు, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): పూండి-పలాస రైల్వే స్టేషన్‌ మధ్యలో సోమవారం రైలు ఢీకొని గుర్తుతెలియని యువకుడు మృతి చెందినట్టు పలాస జీఆర్‌పీ రైల్వే ఎస్‌ఐ ఎ.కోటేశ్వర రావు తెలిపారు. యువకుడి వయసు 35- 40 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. మృతుడి కుడిచేతికి రాజు అనే పేరుతో లవ్‌సింబల్‌తోపాటు ఇత్తడి రింగ్‌ ఉం దన్నారు. బ్లూచెక్స్‌తో ఫుల్‌ చేతుల షర్టు, బ్లాక్‌రంగు గల ఫ్యాంట్‌ ధరించి ఉన్నాడ న్నారు. మృతదేహాన్ని పలాస గవర్నమెంట్‌ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. వివరాలకు 944067567, 9492250069 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

గంజాయితో వ్యక్తి అరెస్టు

నరసన్నపేట, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి తాడేపల్లికి 2.180 కిలోల గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్టు సీఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. తాడేపల్లి పరిధి పొతూరు గ్రామానికి చెందిన పూస దేవిచంద్‌ ఒడిశాలో గంజాయిను కొనుగోలు చేసి తరలిస్తుండగా సోమవారం మడపాం టోల్‌ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేసే సమయంలో పట్టుబడినట్టు తెలిపారు. కేసు నమోదు చేసి దేవిచంద్‌ను రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.

Updated Date - Dec 23 , 2025 | 12:45 AM