చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:03 AM
శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి చికిత్సపొందుతూ మృతి చెందిన ఘటన మంగళ వారం చోటు చేసుకుంది. రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..
శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి చికిత్సపొందుతూ మృతి చెందిన ఘటన మంగళ వారం చోటు చేసుకుంది. రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఈనెల 19న సుమారు 55 ఏళ్ల వ్యక్తి అపస్మా రక స్థితిలో పడి ఉండడంతో స్థానికులు 108 వాహ నంలో చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రి లో చేర్పించారు. సదరు వ్యక్తి స్పృహలోనికి రాగా అతని వివరాలు అడుగగా శృంగవరపు లక్ష్మీనారా యణ అని మాత్రమే చెప్పాడని పోలీసులు తెలిపా రు. అయితే సదరు వ్యక్తి మంగళవారం మృతి చెంది నట్టు, కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు టూటౌన్ సీఐ ఈశ్వరరావు తెలిపారు.