Egg rates down: వ్యాపారులకు ‘గుడ్డు’
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:53 PM
Poultry farm managers in worry జిల్లాలో కోడిగుడ్ల ధరల విషయంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. కోళ్లఫారం నిర్వహించే రైతుల కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్క డం లేదు. కానీ రిటైల్ మార్కెట్లో మాత్రం ధర భారీగా ఉంది. కోళ్లఫా రం నిర్వాహకుల వద్ద ఒక్కో గుడ్డు రూ.4.90 చొప్పున కొనుగోలు చేసి.. రిటైల్ మార్కెట్‌లో రూ.7చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో నిర్వాహకు లు ఆందోళన చెందుతున్నారు.
రిటైల్ మార్కెట్‌లో ఒక్కోటి రూ.7
రైతుకు దక్కేది రూ.4.90 మాత్రమే
ఆందోళనలో కోళ్లఫారాల నిర్వాహకులు
రణస్థలం, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కోడిగుడ్ల ధరల విషయంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. కోళ్లఫారం నిర్వహించే రైతుల కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్క డం లేదు. కానీ రిటైల్ మార్కెట్లో మాత్రం ధర భారీగా ఉంది. కోళ్లఫా రం నిర్వాహకుల వద్ద ఒక్కో గుడ్డు రూ.4.90 చొప్పున కొనుగోలు చేసి.. రిటైల్ మార్కెట్‌లో రూ.7చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో నిర్వాహకు లు ఆందోళన చెందుతున్నారు. కోడి గుడ్ల ధర తగ్గడంతో కోళ్లఫారాల నిర్వ హణ కష్టమేనని వాపోతున్నారు. జిల్లాలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో పౌల్ర్టీ రైతులు ఉన్నారు. గుడ్లు ఉత్పత్తి చేసే పౌల్ర్టీ ఫారాలు ఉన్నాయి. సుమా రు 3లక్షల వరకూ కోళ్లు ఉన్న ట్టు తెలుస్తోంది. వేసవిలో అధిక ఉష్ణోగ్ర తను తట్టుకోలేక చాలాచోట్ల గుడ్లు పెట్టే కోళ్లు చనిపోయాయి. దీనికితోడు అమె రికా వంటి దేశాల్లో కోడిగుడ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో రైతు వద్దే గుడ్డు ధర రూ.5.90కు ఎగబాకింది. కానీ గత పదిరోజులుగా దీని ధర పతనమై.. ప్ర స్తుతం రూ.4.90 చేరుకుంది. మన జిల్లాలో ఉత్పత్తయ్యే గుడ్లు ఎక్కువగా ఒడిశాకు ఎగుమతి అయ్యేవి. కాగా.. ఇటీవల ఒడిశా లో గుడ్లు పెట్టే పౌల్ర్టీఫారాలు పెరగడంతో ఇక్కడ నుంచి గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా డిమాండ్ తగ్గి.. ధర కూడా తగ్గిందనే వాదనలు వినిపిస్తున్నాయి. గుడ్డుకు ఉండే గిరాకీ, మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ట్రేడర్లు ధరను నిర్ణయిస్తారు. ప్రస్తుతం పేపరు ధర ప్రకారం ఒక్కో గుడ్డు రూ.4.90 ఉంది. ఏజెంట్ కమీషన్ 25 పైసలు రైతుపైనే పడుతోంది. అంటే కేవలం రైతుకు రూ.4.65 మాత్రమే అందుతోంది. ఇంత తక్కువ ధరతో ఫారం నిర్వహణ చాలా కష్టమని రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా కోళ్ల దాణా ధర భారీగా పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో గుడ్డు ధర రూ.6దాటితే కానీ కోలుకోలేమని చెబుతున్నారు.
దళారులకు మేలు
బహిరంగ మార్కెట్‌లో మాత్రం కోడిగుడ్ల ధర తగ్గలేదు. రిటైల్ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు రూ.7 పలుకుతోంది. హోల్‌సేల్ మార్కెట్‌లో రూ.6.50 వరకూ విక్రయిస్తు న్నారు. అంటే రైతుకు, వినియోగదారుడికి మధ్య రూపాయి నుంచి రూ.1.60 ఉందన్న మాట. అన్ని కష్టాలు, వ్యయప్రయాసలు పడి రైతు పెంచి కోడిగుడ్డును ఉత్పత్తి చేస్తే.. ట్రేడింగ్ కంపెనీలు, ఏజెంట్లు, దళారులు దోచుకుంటున్నారు. వాస్తవానికి జిల్లాలో కోళ్ల ఫారాలతో పేరుమోసిన కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. కోడిపిల్లలు, దాణా సదరు కంపెనీలే అందిస్తున్నాయి. ఫారాల నిర్వహణ మాత్రం రైతులు చూసుకోవాలి. సాధారణ బ్రాయిలర్ కోళ్ల విషయంలో ఎప్పటికప్పుడు సమయానుకూలంగా వెళ్లిపోతుంటాయి. కానీ గుడ్లు పెట్టే కోళ్ల విషయంలో మాత్రం చాలా సమయం ఉంచాలి. ఏమాత్రం ధర హెచ్చు తగ్గులు వచ్చినా రైతులు నష్టపోక తప్పదు. అందుకే కూటమి ప్రభుత్వం స్పందించి రాయితీలు కల్పించాలని పౌల్ర్టీఫారాల రైతులు కోరుతున్నారు.
సంక్షోభంలో పరిశ్రమలు
ప్రస్తుతం పౌల్ర్టీ పరిశ్రమలు సంక్షోభంలో ఉన్నాయి. వ్యాధులతో కోళ్లు చనిపోతున్నాయి. ధర స్థిరీకరణ కూడా లేదు. ట్రేడర్లు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం కోడిగుడ్ల ధర బహిరంగ మార్కెట్‌లో బాగుండగా.. రైతుల వద్ద మాత్రం తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. రోజుకు రూ.30వేల వరకు నష్టం వాటిల్లితోంది. రాష్ట్ర ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.
- కొవ్వూరు కృష్ణారెడ్డి, అయ్యప్ప పౌల్ర్టీఫారం నిర్వాహకుడు, రణస్థలం