అరెస్టు వారెంట్ జారీ అయిందని..
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:39 AM
డిజిటల్ అరెస్టు వారెంట్ జారీ అయిందంటూ బెదిరించి రూ.80వేలు వసూలు చేసిన ఘటనపై బాధితుడు ఫి ర్యాదు మేరకు కేసు నమోదైనట్టు ఎస్‌ఐ కె.మధుసూ దనరావు తెలిపారు.
రూ.80 వేలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
మోసపోయినట్టు ఆలస్యంగా గుర్తించిన బాధితుడు
పోలీసులకు ఫిర్యాదు
పాతపట్నం, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): డిజిటల్ అరెస్టు వారెంట్ జారీ అయిందంటూ బెదిరించి రూ.80వేలు వసూలు చేసిన ఘటనపై బాధితుడు ఫి ర్యాదు మేరకు కేసు నమోదైనట్టు ఎస్‌ఐ కె.మధుసూ దనరావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక నరసింహనగర్-2లో నివాసముంటున్న విద్యుత్‌శాఖలో లైన్‌మన్‌గా పనిచేస్తున్న కావలి వెంకట భీష్మ నేతాజీకు ఈ ఏడాది సెప్టెంబరు 23వ తేదీ ఉదయం 7గంటలకు ఓ నెంబరు నుంచి ఫోన్ వచ్చిం ది. ఫోన్‌లో తాము విజిలెన్స్ శాఖ నుంచి ఫోన్ చేస్తు న్నామని, నీపై కేసు నమోదైందని, అందువల్ల డిజిటల్ అరెస్ట్ వారెంట్ జారీ అయినట్టు చెప్పారు. అరెస్టు అవుతారా? లేకుంటే రూ.80వేలు చెల్లించి తప్పించుకుం టారా? అన్ని ప్రశ్నించారు. దీంతో ఏమి చేయాలో తెలియక డబ్బులు చెల్లించేందుకు భీష్మ ఒప్పుకున్నాడు. ఓ మొబైల్ ఫోన్ నెంబరు ఇవ్వగా.. ఆ మొత్తాన్ని ఫోన్‌పే ద్వారా చెల్లించాడు. ఆ తర్వాత తాను మోస పోయానని గుర్తించి సోమవారం సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ (1930)కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. కాగా సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమ త్తంగా ఉండాలని తెలిపారు. గుర్తు తెలియని నెంబర్ల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తే భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని ఎస్‌ఐ సూచించారు.