Share News

అంబరాన సిరి సంబరం

ABN , Publish Date - May 06 , 2025 | 11:55 PM

మాకివలస గ్రామదేవత అసిరితల్లి సిరిమానోత్సవాలు అంబరాన్ని తాకాయి. గడచిన నాలుగు రోజు లుగా జరుగుతున్న ఉత్సవాలు మంగళవారం సిరి మాను ఊరేగింపుతో ముగిశాయి.

అంబరాన సిరి సంబరం
సిరిమాను తిలకించేందుకు తరలివచ్చిన వేలాది మంది భక్తులు

  • అసిరితల్లికి ముర్రాటల సమర్పణ

  • వేలాదిగా తరలివచ్చిన భక్తులు

  • కిక్కిరిసిన మాకివలస

నరసన్నపేట, మే 6(ఆంధ్రజ్యోతి): మాకివలస గ్రామదేవత అసిరితల్లి సిరిమానోత్సవాలు అంబరాన్ని తాకాయి. గడచిన నాలుగు రోజు లుగా జరుగుతున్న ఉత్సవాలు మంగళవారం సిరి మాను ఊరేగింపుతో ముగిశాయి. శిమ్మ పాపినాయుడు ఇంటి నుంచి బయలుదేరిన నిరిమాను గ్రామంలోని పలు వీధుల గుండా సాగింది. సిరిమానుపై పురోహితుడు యాళ్ల చిన్నప్పల నాయుడు కూర్చొని భక్తులను ఆశీ ర్వదించారు. వందలాది మంది మహిళలు కలశాలతో ఊరేగిం పులో పాల్గొని అమ్మవారికి ముర్రాటలు సమర్పించి మొక్కులు చెల్లించారు. మంగళవాయిద్యాలు, బాణసంచా కాలుస్తూ గ్రామస్థులు ఊరేగింపులో పెద్ద ఎత్తున పాల్గొని భక్తిని చాటుకున్నారు. సిరిమాను తిరిగే వీధు ల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. వేలాది మంది భక్తులు తరలి రావడంతో గ్రామం కిక్కి రిసిపోయింది. ఎటువంటి అవాంఛనీయ ఘట నలు జరగకుండా సీఐ జె.శ్రీనివాసరావు పర్య వేక్షణలో నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట ఎస్‌ఐలు దుర్గాప్రసాద్‌, సందీప్‌, అశోక్‌బాబు, అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. రోప్‌ పార్టీ సాయంతో సిరిమానోత్సవం చేపట్టారు.

అమ్మవారిని దర్శించుకున్న నేతలు

మాకివలసలో అరిసితల్లి ఉత్సవాల్లో పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, మాజీమంత్రులు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్‌ తో పాటు పలువురు నే తలు పాల్గొని అమ్మ వారిని దర్శించుకుని ప్ర త్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేత ధర్మాన తేజ్‌కుమార్‌, ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొ న్నారు.

Updated Date - May 06 , 2025 | 11:55 PM