Share News

అమెజాన్‌ ఏజెన్సీ ఇప్పిస్తానని చెప్పి..

ABN , Publish Date - Sep 11 , 2025 | 12:00 AM

పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో అమె జాన్‌ ఏజెన్సీ ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి ఫేక్‌ ఐడీ ద్వారా రూ.35,400 స్వాహా చేశాడు. ఇంకా మరో రూ.2 లక్షలు ఇస్తే అనుమతులు ఇప్పిస్తానని చెప్పడంతో అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

అమెజాన్‌ ఏజెన్సీ ఇప్పిస్తానని చెప్పి..

  • ఫేక్‌ ఐడీ ద్వారా నగదు స్వాహా

  • మోసపోయినట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

పలాస, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో అమె జాన్‌ ఏజెన్సీ ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి ఫేక్‌ ఐడీ ద్వారా రూ.35,400 స్వాహా చేశాడు. ఇంకా మరో రూ.2 లక్షలు ఇస్తే అనుమతులు ఇప్పిస్తానని చెప్పడంతో అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అసలు బండారం బయట పడింది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కాశీబుగ్గ కేటీ రోడ్డులో వివిధ పత్రికలకు ఏజెన్సీ నిర్వహిస్తున్న జి.తిరుమల ఈ నెల 6వ తేదీన ఓ అపరిచిత వ్యక్తి కలుసుకున్నాడు. తనది ఎస్‌.కోట మండలం ధర్మవరం అని, తన పేరు హర్షవర్ధన్‌గా పరిచయం చేసుకున్నాడు. తాను అమె జాన్‌ ఏజెన్సీలను ఇప్పించేందుకు ఈ ప్రాంతంలో అధికారిగా నియమించారని, ఏజెన్సీ కావాలంటే తనను సంప్రదించాలని కోరాడు. దీంతో ఆయన వేషభాష చూసి ఆయన్ని తిరుమల నమ్మాడు. తనకు ముందుగా రూ.35,400 నగదు ఇచ్చి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నాడు. దీంతో తిరుమల ఫోన్‌ పే ద్వారా నగదు బదిలీ చేశాడు. దీంతో ఆయన వెళ్లిపోయాడు. మంగళవారం సాయంత్రం మళ్లీ వచ్చి రూ.2లక్షలు నగదు ఇస్తే ఏజెన్సీ ఖరారు చేస్తానని కోరడంతో పాటు గాబరా పెడుతుండడంతో తిరుమలకు అనుమానం వచ్చింది. దీంతో స్థానికంగా ఉండే అమెజాన్‌ ఏజెన్సీ నిర్వాహకులను తిరుమల సంప్రదించాడు. ఈ ప్రాంతలో కొత్త గా మరో బ్రాంచ్‌ ఇచ్చే అవకాశాలు లేదని తెలుసుకుని, కాశీబుగ్గ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో హర్షవర్ధన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తు న్నారు. జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన మెయిల్‌ ఐడీలో నగదు జమయినట్లు గుర్తిం చారు. ఎస్‌ఐ నర్సింహమూర్తి మాట్లాడుతూ.. జార్ఖండ్‌కు చెందిన వ్యక్తి అకౌంట్‌ లో నగదు జమయినట్టు గుర్తించామన్నారు. ఆ బ్యాంక్‌ అకౌంట్‌ను ఫ్రీజ్‌ చేయిం చేలా సంబంధిత బ్యాంకు అధికారులకు తెలియజేయాలని బాధితుడికి సూచించినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Sep 11 , 2025 | 12:00 AM