Share News

పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

ABN , Publish Date - May 25 , 2025 | 11:27 PM

హిరమండలం, కొత్తూ రుల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళ నాలు నిర్వహించారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక
హిరమండలం: ఉన్నత పాఠశాల 1983-84 పూర్వ విద్యార్థులు

హిరమండలం/కొత్తూరు, మే 25(ఆంధ్రజ్యోతి): హిరమండలం, కొత్తూ రుల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళ నాలు నిర్వహించారు. హిరమండలం ఉన్నత పాఠశాలలో 1983-84 సంవత్స రంలో పదో తరగతి చదివిన విద్యార్థులు, కొత్తూరు జూనియర్‌ కళాశా లలో 1987-88 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు కలుసు కుని నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. నాటి జ్ఞాపకాలు, నేటి పరి స్థితులను ఒకరికొకరు చెప్పుకుని ఆనందం పొందారు. నాటి గురువులను సత్కరించి వారి ఆశీస్సులు అందుకున్నారు. కార్యక్రమాల్లో ఆయా పాఠ శాలల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
సోంపేట, మే 25(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలో 1992-93 విద్యా సంవత్సరం పదో తరగతి చదివిన విద్యార్థులంతా ఆదివారం ఒక్క చోట చేరుకుని సందడిగా గడిపారు. ఈ సందర్భంగా ఒకరికొకరు అభినం దనలు తెలుపుకుని, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా ఆనాటి ఉపాధ్యాయులు మల్లేశ్వరరావు, కామేశ్వరరావు, దుర్గారావు, అప్పలస్వామి, లక్ష్మిలను ఘనంగా సన్మానించారు.
కవిటి, మే 25(ఆంధ్రజ్యోతి): బొరివంక జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠ శాలలో 2003-04 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థు లంతా ఆదివారం ఒకచోట చేరారు. తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురు వులను సత్కరించి, ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
బూర్జ, మే 25(ఆంధ్రజ్యోతి): బూర్జ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠ శాలలో 1992-93 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులం దరూ ఆదివారం పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. హెచ్‌ఎం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2025 | 11:27 PM