Share News

Alternative employment ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి

ABN , Publish Date - May 23 , 2025 | 11:54 PM

Alternative employmentఎండీయూ వాహనాల రద్దుతో మా కుటుంబాలు రోడ్డున పడ్డాయని ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ఎండీయూ ఆపరేటర్లు కోరారు.

Alternative employment ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి
తహసీల్దార్‌ రామారావుకు వినతిపత్రం అందిస్తున్న ఎండీయూ వాహనాల ఆపరేటర్లు

జలుమూరు, మే 23 (ఆంధ్రజ్యోతి): ఎండీయూ వాహనాల రద్దుతో మా కుటుంబాలు రోడ్డున పడ్డాయని ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ఎండీయూ ఆపరేటర్లు కోరారు. ఈ మేరకు శుక్రవారం తహసీల్దార్‌ జె.రామారావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రెండేళ్లుగా బకాయి ఉన్న అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన కమీషన్‌ తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఎండీయూ వాహనాల రుణాలకు సంబంధించి ఎన్‌ఓసీలు ఇప్పించాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో ఎండీ యూ ఆపరేటర్ల సంఘం మండల అధ్యక్షుడు ప్రసాద్‌, ఆపరేటర్లు జనార్దన, శంకర్‌, అచ్యుతరావు, పోలినాయుడు, సూర్యనారాయణ, అప్పలనాయుడు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2025 | 11:54 PM