Share News

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి: ఎన్‌ఈఆర్‌

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:10 AM

విద్యార్థులు చదు వుతో పాటు క్రీడల్లో విద్యార్థులు రాణించాలని ఎమ్మెల్యే నడు కుదిటి ఈశ్వరరావు అన్నారు.

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి: ఎన్‌ఈఆర్‌
రణస్థలం: పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌

రణస్థలం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో విద్యార్థులు రాణించాలని ఎమ్మెల్యే నడు కుదిటి ఈశ్వరరావు అన్నారు. కొవ్వాడ మత్స్యలేశం జడ్పీ హై స్కూల్లో బాలబాలికల గ్రిగ్స్‌ పోటీలను గురువారం ప్రారం భించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మనసికోల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం పెంపొందుతుం దన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు మైలపల్లి పొలీస్‌, కొమర లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

పొందూరు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మండల స్థాయి గ్రిగ్స్‌ పోటీలు పిల్లలవలస జడ్పీ పాఠశాలలో గురు వారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను సర్పంచ్‌ బుడు మూరు పోలినాయుడు, ఎంఈవో-1 వాగ్దేవి, హెచ్‌ఎం బస్వా గొల్లవాడు ప్రారంభించారు. రెండు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలో విజేతలు జిల్లాస్థాయి పోటీలకు ఎంపికవుతారన్నారు.

సోంపేట రూరల్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి గ్రిగ్స్‌ పోటీ లు గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంఈవో లు కృష్ణంరాజు, జోరాడు, హెచ్‌ఎం కృష్ణారావు, స్థానిక నాయ కుడు రాంబుడ్డి గణపతి తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని ఉపాధ్యాయులు తెలిపారు.

కంచిలి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): పెద్ద శ్రీరాంపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి గ్రిగ్స్‌ పోటీల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈవోలు ఎస్‌.శివరాంప్రసాద్‌, చిట్టిబాబు, టీడీపీ నేత మాదిన రా మారావు మాట్లాడుతూ.. క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఇప్పిలి కృష్ణారావు, ఉపాధ్యా యులు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2025 | 12:10 AM