Share News

విద్యతోపాటు క్రీడల్లో రాణించాలి

ABN , Publish Date - Dec 11 , 2025 | 12:07 AM

విద్యార్థు లు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.

విద్యతోపాటు క్రీడల్లో రాణించాలి
క్రీడా పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గోవిందరావు

  • ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

కొత్తూరు, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): విద్యార్థు లు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గ్రిగ్స్‌ పోటీలను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో క్రమ శిక్షణ, ధైర్యసాహసాలు, నాయకత్వ లక్షణాలు పెం పొందుతాయన్నారు. అనంతరం పీఎంశ్రీ నిధులు రూ.6.50 లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్‌ ప్లాంట్‌, కిచెన్‌ గార్డెన్లను ప్రారంభిం చారు. ఉద్యోగ భద్రత కల్పిం చాలని సమగ్ర శిక్షలో భాగం గా మండల విద్యాశాఖ కార్యా లయంలో పనిచేస్తున్న పలు వురు సిబ్బంది ఎమ్మెల్యేను కోరి వినతి పత్రం అందించారు. మామిడి గోవింద రావుకు వినతి పత్రం ఇచ్చారు. అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 11 , 2025 | 12:14 AM