అవయవ దాత కుటుంబానికి స్థలం కేటాయింపు
ABN , Publish Date - Oct 09 , 2025 | 11:55 PM
సోంపేటకు చెందిన విద్యార్థి ప్రేమ్ చంద్ అవయవా లను దానం చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన కుటుం బానికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది.
కవిటి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): సోంపేటకు చెందిన విద్యార్థి ప్రేమ్ చంద్ అవయవా లను దానం చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన కుటుం బానికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. రామయ్యపుట్టుగలో స్థలానికి చెందిన పట్టాను ఆయన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే బి.అశోక్ అందించారు. ప్రేమ్ చంద్ చారి టబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసేందుకు కొజ్జిరియా పంచాయతీ లో స్థలాన్ని కేటాయించారు. కార్యక్రమంలో కంచిలి తహసీల్దార్ ఎన్. రమేష్ కుమార్, ఆర్‌ఐ కృష్ణరౌళో తదితరులు పాల్గొన్నారు.