Yogandhra': ‘యోగాంధ్ర’కు సర్వసన్నద్ధం
ABN , Publish Date - Jun 19 , 2025 | 11:37 PM
International Yoga Celebrations అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో ఈ నెల 21న యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు హాజరుకానున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లా నుంచి 20వేల మంది విశాఖకు తరలింపు
విజయవంతంగా ట్రయల్ రన్
శ్రీకాకుళం, కలెక్టరేట్, జూన్ 19(ఆంద్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో ఈ నెల 21న యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు హాజరుకానున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా నుంచి 20వేల మందిని విశాఖ తరలించనున్నారు. ఇందుకోసం 430 బస్సులను కేటాయించారు. గురువారం ఆయా బస్సుల ఇన్‌చార్జిలు, స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. బస్సుల్లో ప్రయాణించే ప్రతీ బృందానికి బాధ్యత వహించే ఇన్‌చార్జిలను కలెక్టర్ ఎంపిక చేశారు. బస్సులు, పార్కింగ్ ప్రాంతాలు, వేదికల వరకు రాకపోకలు, పాల్గొనేవారికి అందించే ఆహారం, టీ-షర్టులు, మ్యాట్‌లు, వాటర్ ప్యాకెట్లు, మరుగుదొడ్ల లొకేషన్లను పరిశీలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఆహారంతోపాటు తాగునీరు, వైద్యం వంటి సౌకర్యాల కల్పనపై సూచనలు చేశారు. వేదికలో సీ-16 బ్లాక్ నుంచి మొత్తం 24 బ్లాక్‌లను భీమిలి బీచ్ రోడ్డులో శ్రీకాకుళానికి కేటాయించినట్లు సమాచారం. కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటు సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, గొండు శంకర్, నడుకుదిటి ఈశ్వరరావు, జేసీ ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్, సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ పాల్గొన్నారు.