Share News

అన్ని రంగాలకు జీఎస్టీ 2.0తో మేలు

ABN , Publish Date - Oct 17 , 2025 | 12:09 AM

అన్నిరంగాలకు జీఎస్టీ 2.0తో మేలు జరుగుతుందని అధికారులు, ప్రజా ప్రతినిధులు తెలిపారు. గురువారం జిల్లాలోని పలుచోట్ల రవాణాశాఖ ఆధ్వర్యంలో జీఎస్టీపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు.

అన్ని రంగాలకు  జీఎస్టీ 2.0తో మేలు
కాశీబుగ్గ: జీఎస్టీ ర్యాలీని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష:

అన్నిరంగాలకు జీఎస్టీ 2.0తో మేలు జరుగుతుందని అధికారులు, ప్రజా ప్రతినిధులు తెలిపారు. గురువారం జిల్లాలోని పలుచోట్ల రవాణాశాఖ ఆధ్వర్యంలో జీఎస్టీపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు.

కాశీబుగ్గ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి):రవాణా, లాజిస్టిక్స్‌ రంగానికి జీఎస్టీ తగ్గిం పు సూపర్‌గిఫ్ట్‌ అని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.గురువారం జంట పట్ట ణాల్లో ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో రవాణా,లాజిస్టిక్స్‌ రంగానికి సూపర్‌ గిఫ్ట్‌ ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి మద్దతుగా జీఎస్టీపై ర్యాలీ నిర్వహించారు. కార్యక్ర మంలో ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబురావు, టీడీపీ రాష్ట్ర బీసీసెల్‌ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావు, పీరుకట్ల విఠల్‌రావు, కౌన్సిలర్‌ దువ్వాడ శ్రీకాంత్‌,ఎం శ్రీనివాస్‌రావు,సప్ప నవీన్‌,జోగ మల్లేశ్వరరావు,నరేంద్ర పాల్గొన్నారు.

ఫనరసన్నపేట, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం వాహనాలపై జీఎస్టీ 2.0 సంస్కరణల్లో భాగంగా పన్ను తగ్గించిందని నియోజవర్గ టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన తెలిపారు. సత్యవరం జంక్షన్‌ వద్ద రవాణాశాఖ ఆధ్వర్యం లో నిర్వహించిన జీఎస్టీపై అవగాహన ర్యాలీను ప్రారంభించారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్టీవో సంజీవరావు, రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు.

ఫపాతపట్నం అక్టోబరు16(ఆంధ్రజ్యోతి):పాతపట్నం ఎంపీడీవో కార్యాలయంలో ఎంవీఐ ఆధ్వరం్యలో జీఎస్టీ తగ్గుదలపై అవగాహనకార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్‌కూడలి నుంచి కోర్టుకూడలి వరకూ ఆటోలు, టాక్సీలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంవీఐ ఎం.గోవిందరావు, టీడీపీ మండ లాధ్యక్షుడు పైల బాబ్జీ, టీడీపీ పట్టణాధ్యక్షుడు సైలాడ సతీష్‌ మండలప్రత్యేకాధి కారి కరుణాకర్‌, ఎంపీడీవో రమణమూర్తి పాల్గొన్నారు.

ఫటెక్కలి,అక్టోబరు 16(ఆంద్రజ్యోతి):ప్రతిఒక్కరూ సూపర్‌ జీఎస్టీపై అవగాహన కలిగిఉండాలని ఎంవీఐ సంజీవరావు తెలిపారు. టెక్కలిలో జీఎస్టీపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమంలో ఎస్‌ఐ రాము, మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు బగాది శేషగిరి, ప్రసాద్‌రెడ్డి, కామేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2025 | 12:09 AM