Greevence : వినతులన్నీ పరిష్కరించాలి
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:05 AM
To solve problems ప్రజా ఫిర్యాదుల వేదిక.. మీ-కోసం కార్యక్రమంలో నమోదైన అన్ని వినతులను క్షుణ్ణంగా పరిశీలించి.. సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల వేదిక.. మీ-కోసం కార్యక్రమంలో నమోదైన అన్ని వినతులను క్షుణ్ణంగా పరిశీలించి.. సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘మీ-కోసం’ కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్‌తో కలిసి ప్రజల నుంచి వివిధ సమస్యలపై 86 వినతులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నిర్ణీత సమయంలోగా అర్జీలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ డి.పృథ్వీరాజ్ కుమార్, డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు, ఉప కలెక్టర్ పద్మావతి, జడ్పీ సీఈవో శ్రీధర్ రాజా, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.