Share News

రైతులంతా ‘ఈపంట’ నమోదు చేయించుకోవాలి

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:06 AM

రైతులంతా ‘ఈ పంట’ నమోదు చేయించుకోవాలని, ఈ దిశలో అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బి.అశోక్‌ కోరారు. రామయ్యపుట్టుగలో వ్యవసాయాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు.

రైతులంతా ‘ఈపంట’ నమోదు చేయించుకోవాలి
కవిటి: వ్యవసాయాధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్‌

కవిటి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): రైతులంతా ‘ఈ పంట’ నమోదు చేయించుకోవాలని, ఈ దిశలో అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బి.అశోక్‌ కోరారు. రామయ్యపుట్టుగలో వ్యవసాయాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరద ప్రవా హంతో ముంపునకు గురైన పంట పరిస్థితులను అడిగి తెలు సుకున్నారు. పొలాల్లో నీటి ఉధృతి తగ్గిందని, పంట సస్యరక్ష ణకు రైతులకు సూచనలందిస్తున్నామని వ్యవసాయాధికారు లు తెలిపారు. ఇంకా 600 టన్నుల యూరియా అవసరమని ఏడీఏ భవానీశంకర్‌ తెలుపగా ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరగా రైతులకు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

క్రీడలతో గుర్తింపు

కవిటి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): క్రీడలతో మంచి గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బి.అశోక్‌ అన్నారు. బైరి పురంలో బైరిపురం ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ పోటీ విజేత లకు సోమవారం బహుమతులు అందించారు. గ్రామీణ ప్రాంతం లో క్రీడాకారులను ప్రోత్సహించేలా ఇటువంటి పోటీలు ఎంత గానో దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో రైజ్‌ సంస్థల అధినేత పి.ప్రవీణ్‌, రమణ, పి.జగదీష్‌ పాల్గొన్నారు.

ప్రతీ ఒక్కరు బీమా చేసుకోవాలి

సోంపేట రూరల్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రతీ ఒక్క రు బీమా చేయించుకోవడం ద్వారా భవిష్యత్‌లో ఆ కుటుం బాలకు ఆసరాగా నిలుస్తుందని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. మామిడిపల్లి గ్రామానికి చెందిన దున్న తులసి కొద్ది నెలల కిందట పాముకాటుకు గురై మృతి చెందగా ఆమె కుటుం బ సభ్యులకు సోమవారం గ్రామీణ బ్యాంకు మంజూ రు చేసిన రూ.20 లక్షల బీమా చెక్కును అందించారు. నాబా ర్డు డీడీఎం రమేష్‌ కృష్ణ, ఏపీజీబీ మేనేజర్‌ బి.శేషగిరి, జన సేన ఇన్‌చార్జి దాసరి రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 12:06 AM