మహిళలకు మెరుగైన వైద్యం లక్ష్యం
ABN , Publish Date - Sep 24 , 2025 | 11:41 PM
మహిళలకు మెరుగైన వైద్యం అందించడమే కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల లక్ష్యమని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాయని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ అన్నారు.
సరుబుజ్జిలి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి):మహిళలకు మెరుగైన వైద్యం అందించడమే కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల లక్ష్యమని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాయని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ అన్నారు. ‘స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’లో భాగంగా షలంత్రి గ్రామంలో వైద్యాధికారి సాహితీ ప్రియదర్శిని ఆధ్వర్యంలో బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ బి.వరలక్ష్మి, సీహెచ్‌వో మోహన్ రావు, సూపర్‌వైజర్ మోహన్ రావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
స్త్రీలకు అన్ని రకాల వైద్యసేవలు: డీఎంహెచ్‌వో
శ్రీకాకుళం రూరల్, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): స్త్రీలకు వివిధ రకాల వైద్యసేవలు అందిస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌వో డా.కె.అనిత అన్నారు. బుధవారం వాకలవలస గ్రామంలో ‘స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలకు క్యాన్సర్ స్ర్కీనింగ్ పరీక్షలతో పాటు వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నామని, వీటిని వినియోగించుకుని ఆరోగ్యంగా ఉండాల న్నారు. సింగుపురం పీహెచ్‌సీ వైద్యాధికారి లిల్లీ నిమ్మకాయల ఆధ్వర్యంలో మహిళలకు వివిధ రకాల వైద్య పరీక్షలు చేసి మందులు అందించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.