Share News

సమ్మెకాలం ఒప్పందాలు అమలు చేయాలి

ABN , Publish Date - Jul 22 , 2025 | 11:32 PM

సమ్మెకాలం ఒప్పందాలు అమలు చేయాలని, సమస్య పరిష్కారానికి సంఘ నాయకులతో ప్రభుత్వం చర్చలు జరపాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి, మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు సీహెచ్‌ మురుగన్‌, కె.వెంకట్‌, ఎం.రవి,శంకర్‌ కోరారు. కాశీబుగ్గలో మునిసిపల్‌ కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమం మంగళ వారానికి ఆరోరోజుకు చేరింది.

 సమ్మెకాలం ఒప్పందాలు అమలు చేయాలి
కాశీబుగ్గ పాతబస్టాండ్‌ వద్ద నిరసన తెలుపుతున్న శానిటేషన్‌ కార్మికులు:

కాశీబుగ్గ, జూలై22(ఆంధ్రజ్యోతి): సమ్మెకాలం ఒప్పందాలు అమలు చేయాలని, సమస్య పరిష్కారానికి సంఘ నాయకులతో ప్రభుత్వం చర్చలు జరపాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి, మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు సీహెచ్‌ మురుగన్‌, కె.వెంకట్‌, ఎం.రవి,శంకర్‌ కోరారు. కాశీబుగ్గలో మునిసిపల్‌ కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమం మంగళ వారానికి ఆరోరోజుకు చేరింది.

ఫఇచ్ఛాపురం/ఆమదాలవలస, జూలై 22(ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించాలని పారిశుధ్య కార్మికులు చేపడుతున్న సమ్మె మంగళవారం కొనసాగింది. ఇచ్ఛాపురం, ఆమదాలవలస మస్టర్‌ కార్యాలయాల వద్ద నిరసన చేపట్టారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన చర్చల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించడంతో తాత్కాలికంగా సమ్మెను విరమిస్తున్నామని,బుధవారం నుంచి విధుల్లో చేరనున్నామని మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు సంతోష్‌, రమేష్‌ పట్నాయక్‌ తెలిపారు.

Updated Date - Jul 22 , 2025 | 11:32 PM