పూజలు చేసి ఇంటికి వస్తూ..
ABN , Publish Date - Aug 08 , 2025 | 11:52 PM
జింకిభద్ర గ్రామానికి చెందిన కూన సీతమ్మ (58) శుక్రవారం ఉదయం బెంకిలి సాధు మెట్ట వద్ద మృతిచెందింది.
సాధుమెట్ట వద్ద మహిళ మృతి
సోంపేట, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): జింకిభద్ర గ్రామానికి చెందిన కూన సీతమ్మ (58) శుక్రవారం ఉదయం బెంకిలి సాధు మెట్ట వద్ద మృతిచెందింది. పోలీసులు, కుటుంబసభ్యుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సీతమ్మ రోజులాగే శుక్రవారం ఉదయం కూడా సాధుమెట్ట వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసి ఇంటికి తిరిగుపయణ మైంది. ఇదే సమయంలో పక్కనే ఉన్న పూలను సేకరిస్తూ గట్టిగా కేకలు వేస్తూ కుప్పకూలిపోయింది. సమీపంలో యోగా చేస్తున్న పలువురు స్పందించి 108 వాహనానికి ఫోన్ చేశారు. అక్కడి చేరుకున్న 108 సిబ్బంది పరిశీలించగా ఆమె మృతి చెందినట్టు నిర్ధారించారు. ఇదిలావుంటే సీతమ్మ మృతిపై పలు అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పూలు కోసే సమయంలో పక్కనే విద్యుత్ లైట్లకోసం ఏర్పాటు చేసి వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురై ఉంటుం దని కొందరు, గుండెపోటుతో మృతి చెంది ఉండొచ్చని మరికొందరు చెబు తున్నారు. ఎస్‌ఐ వి.లవరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.