ఆఫర్ ప్రకటించి.. బురిడి కొట్టించి..
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:19 AM
నరసన్నపేట పట్టణంలో ఒక వస్త్ర దుకాణం ప్రారంభం సందర్భంగా పలు ఆఫర్లు ప్రకటించారు.
బట్టల షాపు యాజమాని తీరుపై మండిపడిన మహిళలు
నరసన్నపేట, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట పట్టణంలో ఒక వస్త్ర దుకాణం ప్రారంభం సందర్భంగా పలు ఆఫర్లు ప్రకటించారు. రూ.30లకే లుంగీ, రూ.40లకే లంగాలు, రూ.35లకే చీర, రూ.50లకే దిండు అంటూ పలు ఆఫర్లు ఇవ్వనున్నట్టు జోరుగా ప్రచారం చేశారు. శుక్రవారం షాపు ప్రారంభం తర్వాత సమీప ప్రాంతాల నుంచి మహిళలు తండోపదండులుగా వచ్చారు. వచ్చిన వారిలో పదుల సంఖ్యలోవారికి మాత్రమే ఆఫర్ ధరలకు ఇచ్చి తర్వాత యజమాని చేతులు ఎత్తేశారు. దీనిపై షాపు యాజమాన్యాన్ని మహిళలు నిలదీశారు. ఇవ్వని ఆఫర్లు ప్రకటించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. షాపు ప్రారంభోత్సవంలో భాగంగా వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అయితే ఈ దిశగా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.