Share News

అధునాతన విధానాలను అవలంబించాలి

ABN , Publish Date - Jul 25 , 2025 | 11:42 PM

పాడి రైతులు అధునాతన అవలంబించాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు.శుక్రవారం మండలంలోని సీదిలో పశుసంవర్ధకశాఖ, పశుగణాభివృద్ధి సంస్థ సంయుక్తంగా సంకరజాతి ఆవుదూడల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించాయి.

 అధునాతన విధానాలను అవలంబించాలి
సుపరిపాలనకు తొలిఅడుగు కార్యక్రమం నిర్వహిస్తున్న ఎంజీఆర్‌:

పాతపట్నం, జూలై25(ఆంధ్రజ్యోతి): పాడి రైతులు అధునాతన అవలంబించాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు.శుక్రవారం మండలంలోని సీదిలో పశుసంవర్ధకశాఖ, పశుగణాభివృద్ధి సంస్థ సంయుక్తంగా సంకరజాతి ఆవుదూడల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించాయి. ఈసందర్భంగా ఆయన కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన లేగదూడల ప్రదర్శన పాడిరైతుల్లో ఆధునిక విధానాలపైఉన్న సందేహాల నివృత్తిచేసిందన్నారు.కార్యక్రమంలో డీఎల్‌డీఏ ఈవో సీహెచ్‌ సత్యప్రకాశ్‌, డీడీ నరసిం హులు, ఎంపీడీవో చంద్రకుమారి, ఏడీ కరుణాకరరావు పాల్గొన్నారు.అలాగే సమస్య లను పరిష్కరించడమే సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమ లక్ష్యమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. మండలంలోని పాశిగంగు పేటలో సుపరిపాలనకు తొలిఅడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు.

Updated Date - Jul 25 , 2025 | 11:42 PM