Share News

కల్తీ మద్యం స్వాధీనం

ABN , Publish Date - Nov 28 , 2025 | 11:54 PM

మండల కేంద్రం లోని పీఆర్‌ వైన్‌ షాప్‌పై శుక్రవా రం ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ అధికారు లు శుక్రవారం దాడులు నిర్వ హించారు.

కల్తీ మద్యం స్వాధీనం
సీజ్‌ చేసిన కల్తీ మద్యం బాటిళ్లతో ఎక్సైజ్‌ సిబ్బంది

సరుబుజ్జిలి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం లోని పీఆర్‌ వైన్‌ షాప్‌పై శుక్రవా రం ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ అధికారు లు శుక్రవారం దాడులు నిర్వ హించారు. 10.88 లీటర్ల కల్తీ మద్యం గుర్తించినట్టు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌కుమార్‌ తెలిపారు. లీటరు పరిమాణం గల తొమ్మి ది వాటర్‌ బాటిళ్లలో నింపిన కల్తీ మద్యంతో పాటు నీరు కలిపి ఉన్న 11 నిబ్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆ సమయంలో షాపులో విధులు నిర్వహిస్తు న్న నాగేశ్వరరావు, శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశా మన్నారు. కల్తీ మద్యం బాటిళ్లతో పాటు నిందితులను ఆమదాలవలస ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించి నట్లు తెలిపారు. జిల్లా అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పల్ల మురళీధర్‌తోపాటు సిబ్బంది రమణ, విజయ్‌, వెంకటేష్‌, గాలిబ్‌ ఈ దాడుల్లో పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2025 | 11:54 PM