నేడు బీఆర్‌ఏయూలో పరిపాలనా భవనం ప్రారంభం
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:38 PM
BRAU building inauguration డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో సుమారు రూ.38 కోట్లతో ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన డాక్టర్ ఎన్టీఆర్ పరిపాలనా భవనా న్ని బుధవారం ఉదయం 11 గంటలకు ప్రా రంభించనున్నారు.
ఎచ్చెర్ల, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో సుమారు రూ.38 కోట్లతో ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన డాక్టర్ ఎన్టీఆర్ పరిపాలనా భవనా న్ని బుధవారం ఉదయం 11 గంటలకు ప్రా రంభించనున్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పుర స్కరించుకుని ఆ భవనాన్ని అందుబాటులోకి తేనున్నారు. జీ ప్లస్ 4 సముదాయంగా నిర్మిం చిన ఈ నూతన భవనంలో స్నాతకోత్సవ, పెద్ద సెమినార్ హాల్‌లు రెండేసి వంతున ఉ న్నాయి. పాలక మండలి, సెనేట్ హాళ్లు ఉన్నా యి. వర్సిటీలో వీసీ, రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు సీడీసీ, అకడమిక్ అఫైర్స్, ఎన్‌ఎస్‌ఎస్, ప్రిన్సిపాల్స్‌కు సంబంధించిన పాలనా విభాగా లు ఈ నూతన భవనంలోనికి మారనున్నాయి. పరీక్షల విభాగం, డీన్‌ల కార్యాలయాలు కూడా అందులోనే ఏర్పాటు కానున్నాయి. వీసీ ప్రొఫె సర్ కేఆర్ రజని మాట్లాడుతూ వర్సిటీలో మరి న్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీఎం ఉషా నిధుల నుంచి వర్సిటీలో నూతన నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు.