Share News

వైభవంగా ఆదిత్యుని కల్యాణం

ABN , Publish Date - Sep 03 , 2025 | 11:57 PM

అరసవల్లి సూర్య నారాయణ స్వామి వారి కల్యా ణం బుధవారం ఘనం గా జరిగింది.

వైభవంగా ఆదిత్యుని కల్యాణం
అరసవల్లి: ఆదిత్యునికి కల్యాణం నిర్వహిస్తున్న దృశ్యం

అరసవల్లి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): అరసవల్లి సూర్య నారాయణ స్వామి వారి కల్యా ణం బుధవారం ఘనం గా జరిగింది. భాద్రపద శుద్ధ ఏకాదశిని పురస్క రించుకుని ఆలయ అనివెట్టి మండపంలో ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రాలు, మంగళ వాయి ద్యాల నడుమ స్వామి కల్యాణం నిర్వహించారు. కార్య క్రమంలో అర్చకులు ఇప్పిలి సాందీప శర్మ, దర్భముళ్ల శ్రీనివాస శర్మ, నగేష్‌ శర్మ పాల్గొన్నారు.

దసరా నవరాత్రి ఉత్సవాలకు శుభరాట

ఇచ్ఛాపురం, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పకీరుపేట సమీపంలో దుర్గా నవరాత్రి ఉత్సవాల నిర్వ హణకు గాను బుధ వారం శుభరాట వేశారు. వేద పండితుడు ఫణి శర్మ ఆధ్వర్యంలో మనోజ్‌ శర్మ స్థాని కులతో పూజలు చేయించారు. కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు.

ఘనంగా సామూహిక కుంకుమ పూజలు

కంచిలి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి) అర్జునాపురం గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక మహిళలు పాల్గొన్నారు.

లక్ష్మీ గణపతికి దశ హారతులు

శ్రీకాకుళం, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): మొండేటివారి వీధిలోని లక్ష్మీ గణపతి ఆలయంలో గణపతి నవరాత్రుల సందర్భంగా బుధవారం అష్టో త్తర సహిత సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవ మూర్తికి గ్రామ ప్రదక్షిణ చేయించారు. దశహారతులు, విశేష అర్చనలు చేశారు. మంగువారితోటలోని పంచముఖేశ్వర ఆలయంలో వినాయక మండపంలో సామూహిక సత్యనారాయణ వ్రతాల నిర్వహించారు.

ఘనంగా గణనాథుని నిమజ్జనం

కవిటి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): కవిటిలోని గణనాథుని నిమజ్జన కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. హాస్పటల్‌వీధి, బెహరా వీధి, కొత్త కాలనీ, కవిటి-కొత్తూరులో నెలకొల్పిన వినా యకుని విగ్రహా లను గ్రామంలో ఊరేగించి రంగాలగెడ్డలో నిమజ్జనం చేశారు. కవిటి హాస్పటల్‌ వీధిలో గణేష్‌ లడ్డూను ఎస్‌.అర్జునరావు రూ.45,501లకు దక్కించుకున్నారు.

మహా దీపారాధన

లావేరు, సెప్టెంబరు 3 (ఆంధ్ర జ్యోతి): అప్పాపురం కోదండ రామాలయం వద్ద గణపతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం దీపారాధన చేప ట్టారు. అలాగే తామా డలో దీపారాధన ఏర్పాటు చేశారు. గణపతి మండపాల్లో ప్రత్యేక పూ జలు, భజనలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Updated Date - Sep 03 , 2025 | 11:57 PM