వైభవంగా ఆదిత్యుని కల్యాణం
ABN , Publish Date - Jun 21 , 2025 | 11:56 PM
ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారా యణ స్వామివారి కల్యాణం శనివారం వైభవంగా జరిగింది.
అరసవల్లి, జూన్ 21(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారా యణ స్వామివారి కల్యాణం శనివారం వైభవంగా జరిగింది. జ్యేష్ట బహుళ ఏకా దశిని పురస్కరించుకుని ఆలయ అని వెట్టి మండపంలో ప్రధాన అర్చ కుడు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి కల్యాణం జరిపారు. కార్యక్ర మంలో ఆలయ ఈవో కేఎన్‌వీడీ ప్రసాద్, అర్చకులు ఇప్పిలి సాందీపశర్మ, ఇప్పిలి షన్ముఖశర్మ, దర్భముళ్ల శ్రీనివాస శర్మ, ఆర్.వికాస్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.