ఆదిత్యుని ఆదాయం రూ.3.50 లక్షలు
ABN , Publish Date - Oct 20 , 2025 | 12:06 AM
అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం రూ.3,50,721 ఆదాయం లభించింది.
అరసవల్లి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం రూ.3,50,721 ఆదాయం లభిం చింది. ఇందులో టిక్కెట్ల ద్వారా రూ.79, 500, విరాళాలు రూ.1,23,446, ప్రసాదాల ద్వారా రూ.1,38,275 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వందలాది మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి అనివెట్టి మండపంలో ఆదివారం శివ పంచాయతన సహిత మహా లింగార్చన నిర్వహించారు. ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఇప్పిలి సాందీపశర్మ లింగార్చన చేశారు. కార్యక్రమంలో పండితులు దర్భ ముళ్ల శ్రీనివాస శర్మ, ఆర్.వికాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
వెండి బిందెలు అందజేత..
సూర్యనారాయణ స్వామికి ఫిరంగిపురం, బూర్జ గ్రామాల కు చెందిన కేశవరావు, ఉమా మహేశ్వరరావు, వెంకట స్వామి ఆదివారం కేజీ 888 గ్రాముల మూడు వెండి బిందెల ను ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్, ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మలకు అందించారు. దాతలను అర్చకులు ఆశీర్వదిం చగా... స్వామి ప్రసాదాలను ఈవో అందించారు.