ఆదిత్యుని హుండీల ఆదాయం రూ.81.84లక్షలు
ABN , Publish Date - May 28 , 2025 | 12:00 AM
అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి వారి 14 హుండీలను మంగళవారం ఆలయఅనివెట్టి మండపంలో శ్రీహరిసేవా, సత్య సాయిసేవా సమితి, శ్రీవారిసేవా సమితి సిబ్బంది లెక్కించారు.
అరసవల్లి, మే27(ఆంధ్రజ్యోతి):అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి వారి 14 హుండీలను మంగళవారం ఆలయఅనివెట్టి మండపంలో శ్రీహరిసేవా, సత్య సాయిసేవా సమితి, శ్రీవారిసేవా సమితి సిబ్బంది లెక్కించారు. ఆదిత్య ఆలయ ఈవో వై.భద్రాజీ, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో 60 రోజు లకు నిర్వహించిన లెక్కింపులో రూ.81,84,890ల ఆదాయంలభించింది. ఇందులో నోట్ల రూపంలో రూ.77,21,606లు, చిల్లర ద్వారా రూ.4,63,284లు లభించాయి. అలాగే 12 యూఎస్ డాలర్లు - 12, పది నేపాల్ రాష్ట్ర బ్యాంకు సెర్వింగ్స్, ఒక ఒమెన్ రియాల్, బంగారం 81గ్రాముల 27మిల్లీగ్రాములు, వెండి మూడు కేజీల 810 మిల్లీగ్రాములు లభించాయి.కార్యక్రమంలో జిల్లా దేవదాయ శాఖ అధికారి ప్రసాద్ పట్నాయక్, ఆముదాలవలస గ్రూప్ దేవాలయాల ఈవో తమ్మినేని రవి, టెక్కలి ఈవో గురునాథం, ఉమారుద్ర కోటేశ్వరస్వామి దేవాలయం ఈవో సుకన్య పాల్గొన్నారు.