వ్యసనాలకు బానిసై.. స్మగ్లర్‌గా మారి
ABN , Publish Date - May 15 , 2025 | 11:26 PM
: చెడువ్యసనాలకు బానిసైన ఓ వ్యక్తి ఆదాయం సరిపడకపోవడంతో స్మగ్లర్‌గా మారాడు. ఈ మేరకు గుణుపూర్-బరంపురం రూట్‌లో ఓ బస్సు డ్రైవరుగా పనిచేస్తున్న సుజీత్ సూర్జియా మద్యానికి బానిస య్యాడు.
పలాస, మే15(ఆంధ్రజ్యోతి): చెడువ్యసనాలకు బానిసైన ఓ వ్యక్తి ఆదాయం సరిపడకపోవడంతో స్మగ్లర్‌గా మారాడు. ఈ మేరకు గుణుపూర్-బరంపురం రూట్‌లో ఓ బస్సు డ్రైవరుగా పనిచేస్తున్న సుజీత్ సూర్జియా మద్యానికి బానిస య్యాడు. ఈనేపథ్యంలో కుటుంబాన్ని పోషణకు ఆదాయం సరిపడకపోవడంతో గంజాయి స్మగ్లరుగా అవతారంఎత్తి పోలీసులకు పట్టుబడ్డాడు.గురువారం కాశీ బుగ్గ డీఎస్పీ బి.వెంకటఅప్పారావు పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. గంజాయి స్మగ్లర్‌తో పాటు గంజాయిని ప్రవేశపెట్టారు. డీఎస్పీ కథనం మేరకు.. ఒడిశాలోనిగుణుపూర్‌కు చెందిన సుర్జియకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. డ్రైవింగ్ చేస్తూ పొట్టపోషించుకుంటున్న క్రమంలో చెడువ్యసనాలకు బానిపై డబ్బంతా మద్యానికి ఖర్చుచేసేవాడు. ఆయన ఆదాయం సరిపడకపోవడంతో గంజాయి రవాణాద్వారా అదనంగా ఆదాయం సంపాదించవచ్చని భావించా డు. ఈక్రమంలో పర్లాకిమిడికి చెందిన పుస్కో పొరిచాతో పరిచయమయ్యాడు. ఆయన గంజాయి స్మగ్లింగ్ చేసి ఆదాయం సంపాదిస్తున్నాడు.ఇతర రాష్ట్రాలకు కూడా సరకు పంపిస్తున్నాడు. ఆయన ఈవిషయాన్ని సుర్జియకు చెప్పగా గం జాయి స్మగ్లింగ్‌కు అంగీకరించాడు.ఈ క్రమంలో 14 కిలోల గంజాయి ప్యా కెట్లను మహారాష్ట్రలోని పూణేలోఉన్న జ్యోతి చవాస్‌కు అప్పగించాలని, ఇందుకు రూ.20వేలు ఇస్తామని పొరిచా తెలియజేశాడు. దీంతో గంజాయి బ్యాగును పలాస రైల్వే స్టేషన్‌కు తరలించి రైలుమార్గం ద్వారా పూనే వెళ్లడానికి బుధవారంరాత్రి సిద్ధమయ్యాడు. సాధారణ తనిఖీల్లో భాగంగా కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ, ఆయన బృందం బ్యాగులు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదస్థితిలో సూర్జియ ఉండడంతో ఆయన్ను ప్రశ్నించగా గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో సూర్జియను పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు. మిగిలిన నిందితులు పుస్కో పొరిచా, జ్యోతి చవాస్‌ల కోసం గాలిస్తున్నారు.