చెడు వ్యసనాలకు బానిసై.. దొంగగా మారి
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:07 AM
చెడువ్యసనాలకు బాని సగా మారిన ఓ యువకుడు దొంగతనా లకు పాల్పడుతు న్నాడు. తాజాగా నరసన్నపేటలో పంచలోహ విగ్రహాలు చోరీకి పాల్పడడంతో పోలీసులు అరెస్టుచేశా రు. శుక్రవారం నరసన్నపేటలో టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు, సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌తో కలిసి అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. ఏఎస్పీ కథనం మేరకు.. నరసన్నపేటలోని ఇందిరానగర్ కాలనీలోగల సిద్ధాశ్రమంలో ఈనెల 18వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు.ఆశ్రమంలోని ఆంజనేయస్వామి, వినాయకుని, కుమారస్వామి, రెండు అయ్యప్పస్వామి విగ్రహాలు, శ్రీరామపట్టాభిషేకం పంచలోహ విగ్రహాలతోపాటు కంచుగంట, ఇత్తిడిపళ్లెం దొంగిలించి గొనెసంచిలో తీసుకువెళ్లారు. సిద్ధాశ్రమంలో చోరీ జరిగినట్లు సాయంత్రం ఏడు గంటలు సమయంలో గుర్తించి ఆశ్రమ కార్యదర్శి ముద్దాడ శ్రీనివాసరావు అదేరోజు ఫిర్యాదుచేశారు.
నరసన్నపేట, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): చెడువ్యసనాలకు బాని సగా మారిన ఓ యువకుడు దొంగతనా లకు పాల్పడుతు న్నాడు. తాజాగా నరసన్నపేటలో పంచలోహ విగ్రహాలు చోరీకి పాల్పడడంతో పోలీసులు అరెస్టుచేశా రు. శుక్రవారం నరసన్నపేటలో టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు, సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌తో కలిసి అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. ఏఎస్పీ కథనం మేరకు.. నరసన్నపేటలోని ఇందిరానగర్ కాలనీలోగల సిద్ధాశ్రమంలో ఈనెల 18వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు.ఆశ్రమంలోని ఆంజనేయస్వామి, వినాయకుని, కుమారస్వామి, రెండు అయ్యప్పస్వామి విగ్రహాలు, శ్రీరామపట్టాభిషేకం పంచలోహ విగ్రహాలతోపాటు కంచుగంట, ఇత్తిడిపళ్లెం దొంగిలించి గొనెసంచిలో తీసుకువెళ్లారు. సిద్ధాశ్రమంలో చోరీ జరిగినట్లు సాయంత్రం ఏడు గంటలు సమయంలో గుర్తించి ఆశ్రమ కార్యదర్శి ముద్దాడ శ్రీనివాసరావు అదేరోజు ఫిర్యాదుచేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం తామరాపల్లి వద్ద ఎస్‌ఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీచేస్తుండగా గొనెసంచె భుజాన వేసుకొని జిల్లేడిమాకివలస జంక్షన్ నుంచి వస్తున్న ఒక వ్యక్తి పోలీసులను చూసి పరుగుతీశాడు. ఎస్‌ఐ దుర్గాప్రసాద్ సిబ్బందితో ఆయన్ను పట్టుకున్నారు. గొనెసంచిలో సిద్ధాశ్రమంలో చోరీకు గురైన రూ.1.40 లక్షలు విలువచేసే పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకొని నరసన్నపేటలోనిహాడ్కోకాలనీకు చెందిన 24 సంవత్సరాల యువకుడు దుంపల సింహాచలాన్ని అరెస్టుచేశారు. గతంలో మారుతీనగర్‌లో ఓ బాలికను వేఽధించడంతో సింహాచలంపై పోక్సో కేసు నమోదయ్యింది. 2021 తన స్నేహితుడితో కలిసి జగన్నాథపురంలో ఒక చోరీ కేసులో బాలనేరస్థుడిగా జువైనల్ హోంకు తరలించారు. మోటార్ సైకిల్ చోరీ కేసులో కూడా అరెస్టు చేశారు. చిన్నతనం నుంచి చెడు వ్యసనాలకు బానిసై నేరస్థుడిగా మారాడు.