Share News

వ్యసనాలకు బానిసై దొంగగా మారి

ABN , Publish Date - Dec 23 , 2025 | 12:41 AM

వ్యసనాలకు బానిసై దొంగగా మారిన ఒడిశా రాష్ట్రం బుంజీనగర్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

వ్యసనాలకు బానిసై దొంగగా మారి
మాట్లాడుతున్న డీఎస్పీ వివేకానంద

  • చోరీ కేసులో ఒడిశా వాసి అరెస్టు

  • బంగారు ఆభరణాలు, బైక్‌ స్వాధీనం

  • వివరాలు వెల్లడించిన డీఎస్పీ వివేకానంద

శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): వ్యసనాలకు బానిసై దొంగగా మారిన ఒడిశా రాష్ట్రం బుంజీనగర్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎచ్చెర్ల పోలీసుస్టేషన్‌ పరిధిలో ఇటీవల జరిగిన ఓ చోరీ కేసులో నిందితుడి నుంచి ఐదు తులాల బంగారం, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం శ్రీకాకుళం సబ్‌డివిజన్‌ కార్యాలయంలో జేఆర్‌ పురం సీఐ ఎం.అవతారం, ఎచ్చెర్ల ఎస్‌ఐ లక్ష్మణరావు, సిబ్బందితో కలిసి డీఎస్పీ వివేకానంద విలేకరులతో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరా ల మేరకు.. ఈ నెల 16న ఎచ్చెర్లలోని రామ్‌నగర్‌ కల్లాల వద్ద నేతింటి సూరమ్మ తన పొలం నుంచి వస్తుండగా.. రోడ్డుపక్కన నిలబడి ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు వెనుక నుంచి వచ్చి ఆమె మెడలో ఉన్న తులం బంగారం పుస్తెలతాడు తెంపే ప్రయత్నం చేశాడు. ఆమె చేతితో గట్టిగా పట్టుకోవ డంతో పుస్తెలు ఆమె చేతిలోనే ఉండిపోగా.. తాడు తో ఆ వ్యక్తి పరాయ్యాడు. దీనిపై సూరమ్మ ఫిర్యా దు మేరకు ఎచ్చెర్ల ఎస్‌ఐ లక్ష్మణరావు కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ చోరీకి పాల్పడింది ఒడిశాలోని బుంజీనగర్‌లో నివాసం ఉంటున్న రావుల వినోద్‌గా గుర్తించారు. ఈ క్రమంలో సోమ వారం ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద వినోద్‌ అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పోలీసు లు అదుపులోకి తీసుకుని విచారించగా.. ఎచ్చెర్ల, జేఆర్‌ పురం, నందిగాం, అనకాపల్లి జిల్లా కశింకోట పోలీసు స్టేషన్లలో ఇతడిపై చైన్‌స్నాసింగ్‌ కేసులు ఉన్నాయి. వినోద్‌ ఒడిశాలోని ఆస్కాలో ఉన్న తన స్నేహితుడు, రాజమండ్రి దగ్గర ఉన్న గోకవరంలో ఉన్న మరో స్నేహితుడితో పలు దొంగతనాలకు పా ల్పడుతుంటారు. ఆస్కాలో ఉన్న మేకల గణేష్‌తో కలిసి బైక్‌లు, గొలుసు దొంగతనాలకు పాల్పడుతు న్నాడు. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్‌ చే స్తుంటారు. శ్రీరామ్‌, పోతురాజు, మౌలాలీలతో కలిసి వినోద్‌ కడప జిల్లా బద్వేలులో ఓ బంగారం దుకాణం మూసివేస్తున్న సమయంలో దాడి చేసి యజమాని వద్ద ఉన్న రెండు బ్యాగ్‌లను లాక్కొని పారిపోయిన విషయం విదితమే. మరో నిందితు డు గణేష్‌ను కూడా అరెస్టు చేస్తామన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 12:41 AM