Share News

పశువైద్య సేవల్లో అలసత్వంపై ఏడీ నిలదీత

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:43 AM

పశువైద్య సేవలు అందించడంలో వైద్యుల నిర్లక్ష్య వైఖరి వీడనాడాలని పాడిరైతులు ఆందోళన చేపట్టారు.

పశువైద్య సేవల్లో అలసత్వంపై ఏడీ నిలదీత
ఏడీ ప్రసాదవర్మను ప్రశ్నిస్తున్న రైతులు

నరసన్నపేట, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): పశువైద్య సేవలు అందించడంలో వైద్యుల నిర్లక్ష్య వైఖరి వీడనాడాలని పాడిరైతులు ఆందోళన చేపట్టారు. బుధవారం స్థానిక దేశవానిపేట పశువైద్యశాల కు వైద్యులు సకాలంలో రాకపోవడంపై ఏడీ ప్రసాదవర్మను నిలదీశారు. గత నాలుగు నెలలుగా పశువైద్యసేవలను అందడంలేదని.. వైద్యులు ఏ సమయంలో వస్తున్నారో తెలియ క ఇబ్బంది పడుతున్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో వైద్యం అందక పశువులు మృతిచెందినట్టు రైతులు నడిమింటి నర్సింహాలు, బగ్గు రవి అన్నారు. ఏడీ ప్రసాదవర్మ స్పందించి ప్రతీ రోజు వైద్యసేవలను అందించడం జరుగుతుందని వైద్యులను డిప్యూటేషన్‌ పద్ధతిలో వేయడం జరుగుతుందని తెలిపారు. ఆందోళనలో దేశవానిపేటకు చెందిన పంగ చిన్నికృష్ణ, మెయ్యశ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 12:43 AM