పశువైద్య శిబిరాల నిర్వహణకు కార్యాచరణ
ABN , Publish Date - Sep 03 , 2025 | 11:40 PM
మండలస్థాయిలో ప్రతి 15రోజలకో సారి ఉచిత పశు వైద్యశిబిర నిర్వహించేలా కార్యాచరణప్రణాళికలు రూపొందిం చాలని పశుసంవర్ధకశాఖ టెక్కలి డివిజన్ ఏడీ సీహెచ్ నరసింహులు తెలిపారు. బుధవారం స్థానిక ప్రాంతీయపశువైద్యశాలలో పాతపట్నం, మెళియాపుట్టి మం డలాల పశుసంవర్ధకశాఖ వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్షించారు.
పాతపట్నం, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): మండలస్థాయిలో ప్రతి 15రోజలకో సారి ఉచిత పశు వైద్యశిబిర నిర్వహించేలా కార్యాచరణప్రణాళికలు రూపొందిం చాలని పశుసంవర్ధకశాఖ టెక్కలి డివిజన్ ఏడీ సీహెచ్ నరసింహులు తెలిపారు. బుధవారం స్థానిక ప్రాంతీయపశువైద్యశాలలో పాతపట్నం, మెళియాపుట్టి మం డలాల పశుసంవర్ధకశాఖ వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈసందర్భం గా మాట్లాడుతూ ఆర్‌ఎస్‌కేలతోపాటు పాడిరైతులవారీగా విజన్ ప్లాన్ తయారుచే యాలని సూచించారు. బహువార్షిక పశుగ్రాసాల సాగు ఉపాధిహామీతో అనుసంధా నం చేసి ఎక్కువమంది రైతులతో పశుగ్రాసం సాగయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. మేలుజాతి ఆడదూడలు పుట్టేవిధంగా ప్రణాళికలు వేసి రైతాంగాన్ని ప్రోత్సహిం చాలన్నారు. పాతపట్నం ఏడీ మంచు కరుణాకరరావు ఆధ్వర్యంలో జరిగిన సమా వేశంలో పశువైద్యులు బి.శ్రీవాణి, పి.అనిల్,మౌనికలతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.