కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు: మామిడి
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:50 PM
టీడీపీకి కార్యకర్తలే పట్టుకొమ్మ లని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.
పాతపట్నం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): టీడీపీకి కార్యకర్తలే పట్టుకొమ్మ లని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ని యోజకవర్గ పరిధిలో పార్టీ పటిష్ఠతకు కృషి చేసిన 43మంది కార్యకర్తలకు ప్ర శంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్య కర్తలు, నాయకులు సమన్వయంగా పనిచేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు మండలశాఖాధ్యక్షులు గ్రామస్థాయి నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.