సమస్యల పరిష్కారానికి చర్యలు
ABN , Publish Date - Nov 21 , 2025 | 11:47 PM
గురుకుల పాఠశాలలో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, టెన్త్, ఇంటర్ విద్యార్థుల శతశాతం ఉత్తీర్ణతకు ఉపాధ్యాయులు దృష్టి సారించాలని ఏపీఈడబ్ల్యూఐడీసీ డైరెక్టర్ పీఎంజే బాబు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎ.సునీల్, జిల్లా గురుకులాల సమన్వయాధికారి వై.యశోదలక్ష్మి అన్నారు.
కంచిలి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): గురుకుల పాఠశాల లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, టెన్త్, ఇంటర్ విద్యార్థుల శతశాతం ఉత్తీర్ణతకు ఉపాధ్యా యు లు దృష్టి సారించాలని ఏపీఈడబ్ల్యూఐడీసీ డైరెక్టర్ పీఎంజే బాబు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎ.సునీల్, జిల్లా గురుకులాల సమన్వయాధికారి వై.యశోదలక్ష్మి అన్నారు. కంచిలి డా.బీఆర్ అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాల/ కళాశాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ.. వెనుకబడిన విద్యార్థులపై శ్రద్ధ కనబర చాలని, రుచికరమైన భోజనాలను విద్యార్థులకు అందించాల న్నారు. గురుకులంలోని సమస్యలను ప్రిన్సిపాల్ శ్రీనివాస రావును అడిగి తెలుసుకున్నారు. అర్ధాంతరంగా నిలిచి పోయి న క్లాస్ రూమ్స్ నిర్మాణం పనులు వేగవంతం చేయాలని డీఈ, ఏఈలను ఆదేశించారు. ఉద్దానం సుజల స్రవంతి ద్వారా విద్యార్థులకు తాగునీరందించాలని ప్రిన్సిపాల్ కోరగా దీనికి వారు స్పందిస్తూ ప్రతిపాదనలు పంపాలని సూచిం చారు. పిల్లలతో కలిసి భోజనాలు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చేపడుతున్న వాలీబాల్ కోర్టు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వర్కులను అధికారులు పరిశీలించారు.