తూకాల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు
ABN , Publish Date - Dec 21 , 2025 | 11:34 PM
వినియోగదారులకు మోసం చేసేలా తూకంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ పి చిన్నమ్మ హెచ్చరించారు.
పాత శ్రీకాకుళం, డిసెంబరు21 (ఆంధ్రజ్యోతి): వినియోగదారులకు మోసం చేసేలా తూకంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ పి చిన్నమ్మ హెచ్చరించారు. జిల్లాలో లీగల్ మెట్రాలజీ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి 24 వరకు జాతీయ వినియోగదారుల దినోత్సావాన్ని పురస్కరిం చుకుని వారోత్సావాలు నిర్వహిస్తున్నారు. వారోత్సావాల్లో భాగంగా ఆదివారం శ్రీకాకుళంలోని ఇలిసిపురం రైతుబజారులో అవగాహన సదస్సు నిర్వహించి, పోస్టర్లను అవిష్కరించారు. అనంతరం చేపలమా ర్కెట్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నమ్మ మాట్లాడు తూ పాతబస్టాండ్‌లో పెద్దమార్కెట్‌లోని చేపల మార్కెట్ వద్ద తనిఖీలు నిర్వహించి కాటాల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించడంతో ఎనిమిది మంది వ్యాపారులపై కేసులు నమోదుచేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ ఎ.బలరామకృష్ణ, టెక్నికల్ అసిస్టెంట్ భార్గవి పాల్గొన్నారు.