పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:22 PM
ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని కేంద్ర బృందం సభ్యుడు (న్యూఢిల్లీ) ఎంఓఆర్డీ పీవో కిరణ్ పాడి అన్నారు.
హరిపురం, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న పను ల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని కేంద్ర బృందం సభ్యుడు (న్యూఢిల్లీ) ఎంఓఆర్డీ పీవో కిరణ్ పాడి అన్నారు. మందస మండలం లో మూడేళ్లలో చేపట్టిన ఉపాధి హామీ పను లను బృంద సభ్యులు ఆదివారం తనిఖీ చేశారు. సిమెంటుతో చేపట్టిన పలు నిర్మాణా లతోపాటు చెరువులు, నీటి కుంటలను పరిశీలించారు. మందసలో మూడు సీసీ రోడ్లు, మూడు చెరువులు, ఎస్‌డబ్యూపీసీని సందర్శించారు. అనంతరం సాబకోట, చీపిలో బీటీ రోడ్లు, జిల్లుండలో సీసీ, బీటీ రోడ్డు, బేతాళ పురంలో బీటీ రోడ్డుతోపాటు ఫాం పాండ్‌ను పరిశీలించారు. సిమెంటు నిర్మా ణాల్లో నాణ్యత లోపంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. చెరువుల తవ్వ కాలను రైతులకు, పంటలకు ఉపయోగ పడేలా తీర్చిదిద్దాల న్నారు. కార్యక్రమంలో కేంద్ర బృంద సభ్యు లు ఎంవోఆర్డీ టెక్నికల్ అధికారి అజయ్ ప్రతాప్ సింగ్, డ్వామా పీడీ బి.సుధాకర రావు, ఏపీడీ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీవో రమేష్ నాయుడు, ఏపీవో హరికృష్ణ పాల్గొన్నారు.