Share News

జంట పట్టణాల్లో ట్రాఫిక్‌ సమస్యపై చర్యలు

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:53 PM

పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో ట్రాఫిక్‌ సమస్యపై ఎట్టకేలకు యంత్రాంగం దృష్టిపెట్టింది. ఇక్కడ రహదారులు అస్తవ్యస్తంగా ఉండడం, ఇష్టారాజ్యంగా పశువుల సంచరిస్తుండడంతో వాహనచోదకులు, ప్రజలకు ఇబ్బందులు తప్ప డంలేదు.జనాభా,ఆదాయపరంగా శ్రీకాకుళంకార్పొరేషన్‌ తర్వాత జంట పట్టణాలు జిల్లాలో కీలకంగా ఉన్నాయి.

 జంట పట్టణాల్లో ట్రాఫిక్‌ సమస్యపై చర్యలు
కాశీబుగ్గ ప్రధాన రహదారిపై సర్వే చేస్తున్న పోలీసులు, మునిసిపల్‌ అధికారులు:

కాశీబుగ్గ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో ట్రాఫిక్‌ సమస్యపై ఎట్టకేలకు యంత్రాంగం దృష్టిపెట్టింది. ఇక్కడ రహదారులు అస్తవ్యస్తంగా ఉండడం, ఇష్టారాజ్యంగా పశువుల సంచరిస్తుండడంతో వాహనచోదకులు, ప్రజలకు ఇబ్బందులు తప్ప డంలేదు.జనాభా,ఆదాయపరంగా శ్రీకాకుళంకార్పొరేషన్‌ తర్వాత జంట పట్టణాలు జిల్లాలో కీలకంగా ఉన్నాయి. రోజుకు సగటున పది వేల వాహనాలు జంటపట్టణాల మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ సరైన పార్కింగ్‌ సదుపాయాలు లేదు. ఈనేపథ్యంలో పెద్దఎత్తున విమర్శలు రావడంతో మునిసిపల్‌ చైర్మన్‌ బళ్ల గిరిబాబు, కమిషనర్‌ శ్రీనివాసులు, డీఎస్పీ షేక్‌ సహబాజ్‌ అహ్మద్‌, సీఐ రామకృష్ణతోపాటు పోలీసులు, మునిసిపల్‌ అధికారులు ఆదివారం సర్వే నిర్వహించారు. వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు కాశీబుగ్గ టెలీఫోన్‌ ఎక్స్చేంజ్‌, కాశీబుగ్గ, పలాస ప్రభుత్వ పాఠశాలల వద్ద స్పీడ్‌బ్రేకర్లు వేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటుపై నిర్ణయించారు. పార్కింగ్‌ స్థలాల ఏర్పా టుపై కూడా చర్చించారు. సంక్రాంతి దృష్ట్యా ముందస్తు చర్యలు చేప ట్టాలని కూడా భావిస్తున్నారు.మునిసిపాలిటీ పరంగా చేపట్టాల్సిన పను ల గురించి డీఎస్పీ పలు సూచనలు చేశారు. ప్రధానంగా స్కూల్‌ జోన్ల వద్ద డివైడర్లు ఏర్పాటుపై చర్చించారు. చర్చించిన అంశాలపై త్వరలో ప్రణాళిక సిద్ధం చేసి పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

Updated Date - Dec 28 , 2025 | 11:53 PM