కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:54 PM
ఎరువులను కృతిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని వ్యవసాయశాఖ ఏడీ వెంకట మధు సూచించారు.
‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్
నరసన్నపేట, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఎరువులను కృతిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని వ్యవసాయశాఖ ఏడీ వెంకట మధు సూచించారు. సోమవారం ఎరువు-బరువు శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించి పట్టణంలో పలు ఎరువుల షాపులను పరిశీలించారు. యూరియా విక్రయాలు చేసే సమయంలో ఇతర ఎరవులు కొనుగోలు చేయాలని రైతులపై ఒత్తిడి తేవద్దన్నారు. ధరల పట్టిక ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం యూరియా స్టాక్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఏవో సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.
జలుమూరు, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి) ఎరువుల అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని వ్యవసాయాధికారి కె.రవికుమార్ హెచ్చరించారు. చల్లవానిపేట కూడలిలోని ఎరువుల దుకాణాన్ని సోమవారం పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. ధరల పట్టిక ఏర్పాటు చేయాలని సూచించారు.
పాతపట్నం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): పాతపట్నంలోని ఎరువుల దుకాణాలను ఏవో కె.సింహాచలం సోమవారం తనిఖీలు నిర్వహించారు. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎరువుల నిల్వలు పరిశీలించారు. కొరసవాడ వీఏఏ లోకేశ్, ఎంపీఈవో వెంకటరమణ తదితరులు ఉన్నారు.
నందిగాం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఎరువుల్ని అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని ఏవో పి.శ్రీకాంత్‌వర్మ అన్నారు. సోమవారం నందిగాంలో గల ఎరువులు, పురుగుమందుల దుకాణాన్ని పరిశీలించారు.