Share News

రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు: జేసీ

ABN , Publish Date - Dec 02 , 2025 | 11:52 PM

ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటు వంటి ఇబ్బంది కలిగించినా చర్యలు తప్పవని మిల్లర్లకు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని ధాన్యం కొనుగో లుకు సంబంధించి ట్యాగైన్‌ మిల్లులను పరిశీలించారు.బ్యాంకు గ్యారెంటీలు అయిపో యినా సాయి బాలాజీ రైస్‌ మిల్లులో ధాన్యం నిల్వలు అధికంగా ఉండడంతో జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మిల్లర్‌పై 6ఏ కేసు నమోదు చేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు.

 రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు: జేసీ
ఎల్‌.ఎన్‌.పేట: రైతులతో మాట్లాడుతున్న ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌:

ఎల్‌.ఎన్‌.పేట, డిసెంబరు2 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటు వంటి ఇబ్బంది కలిగించినా చర్యలు తప్పవని మిల్లర్లకు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని ధాన్యం కొనుగో లుకు సంబంధించి ట్యాగైన్‌ మిల్లులను పరిశీలించారు.బ్యాంకు గ్యారెంటీలు అయిపో యినా సాయి బాలాజీ రైస్‌ మిల్లులో ధాన్యం నిల్వలు అధికంగా ఉండడంతో జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మిల్లర్‌పై 6ఏ కేసు నమోదు చేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మిగతా మిల్లులను పరిశీలించి కొనుగోలులో ఇ బ్బందులను అడిగితెలుసుకున్నారు. ఆయనతో పాటు తహసీల్దార్‌ జామి ఈశ్వరమ్మ, సీనియర్‌ అసిస్టెంట్‌ ఎస్‌ గవరయ్య, ఆర్‌ఐ శ్రీనివాసరావు, వీఆర్వోలు ఉన్నారు.

ప్రతి ధాన్యం గింజ కొనుగోలుచేస్తాం

నరసన్నపేట, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతి ధాన్యం గింజకొనుగోలు చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి త్రినాథస్వామి తెలిపా రు. జమ్ముజంక్షన్‌ వద్దగల లక్ష్మీనారాయణ రైస్‌ మిల్లు, దేశవానిపేట బాలాజీ మిల్లుకు వచ్చిన ధాన్యం నాణ్యతను సివిల్‌సప్లయ్‌, వ్యవసాయశాఖ, ఎఫ్‌సీఐ, క్వాలిటీ కంట్రోల్‌, వ్యవసాయశాస్త్రవేత్తలు పరిశీలించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త కె.మురళీధర్‌, నరసన్నపేట ఏడీఏ వెంకట మధు, ఎఫ్‌సీఐ మేనేజర్‌ కె.అనుధీప్‌నాయుడు, అసిస్టెంట్‌ మేనేజర్‌ క్వాలిటీ కంట్రోల్‌ సివిల్‌సప్లయ్‌ విభాగం అధికారి విజయరాజు, ఏవోలు చిరంజీవి, సూర్యకుమారి, వెంకట్రావు పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2025 | 11:52 PM