Share News

స్పందించని అధికారులపై చర్యలు తప్పవు

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:40 AM

సమస్యలపై తమ కార్యాల యాలకు వచ్చే ప్రజలను పట్టించుకోని అధికారులపై చర్యలు తప్పవని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

స్పందించని అధికారులపై చర్యలు తప్పవు
సమస్యలు తెలుసుకుంటున్న మంత్రి అచ్చెన్నాయుడు

  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, అక్టోబరు 22(ఆంధ్ర జ్యోతి): సమస్యలపై తమ కార్యాల యాలకు వచ్చే ప్రజలను పట్టించుకోని అధికారులపై చర్యలు తప్పవని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన ప్రజాదర్బార్‌ నిర్వహించారు. జిల్లా న లుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై కార్యాలయాలకు వెళు తుంటే కొందరు అధికారులు పట్టించుకో కుండా పదేపదే తిప్పుతున్నారని ప్రజలు మంత్రి వద్ద మొ రపెట్టుకున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ప్రజా సమస్యలు పట్టించుకోని అధికారులపై చర్యలు తీ సుకోవాలని టెక్కలి ఆర్‌డీవో కృష్ణమూర్తికి సూచిం చారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిం చాలని, నూతన పింఛన్లు, గృహాలు మంజూరు చేయాలని పెద్ద ఎత్తున మంత్రికి వినతులు అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ బగాది శేషగిరి, పీఏసీఎస్‌ అధ్యక్షురాలు వెలమల విజయలక్ష్మి, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్ర సాద్‌, టీడీపీ నేతలు నంబాళ శ్రీనివాస్‌, వెలమల కామేశ్వరరావు, పినకాన అజయ్‌ కుమార్‌, బోయిన సత్య శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

భూముల పరిరక్షణకు చర్యలు

టెక్కలి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూముల పరిరక్షణకు చొరవ చూపాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. బుధవారం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం లో ఆర్డీవో ఎం.కృష్ణమూర్తితో పాటు టెక్కలి, కోట బొమ్మాళి, సంతబొమ్మాళి తహసీల్దార్లు సత్యం, అప్పలరాజు, శ్రీనివాసరావులతో సమావేశమై మం డలాల వారీగా ప్రభుత్వ భూముల వివరాలు ఆరా తీశారు. చింతలగార, జగతిమెట్ట, అంజనాపురం, చేరివీధి లేఅవుట్లలో ఎన్ని స్థలాలు ఖాళీగా ఉన్నాయి? ఎంతమందికి పట్టాలు ఇచ్చారనే వివరాలు ఆరాతీశారు. జగతిమెట్ట లేఅవుట్‌లో 389 పట్టాలకు గాను 416 ప్లాట్లు ఉండగా... అందులో 18 ప్లాట్లు తొలగించామని తహసీల్దార్‌ తెలిపారు. కోటబొమ్మాళి మండలంలో 43 లేఅవుట్లలో 400 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయని.. అర్హులైన వారి నుంచి అర్జీలు తీసుకొని వాటిని పంపిణీ చేయొచ్చని చె ప్పారు. సంతబొమ్మాళి మండలంలో రైతు సమస్య లపై వివరాలు సేకరించారు. అనంతరం సబ్‌క లెక్టర్‌ కార్యాలయంలో సమావేశ మందిరాన్ని మం త్రి పరిశీలించారు. బగాది శేషగిరిరావు, జనసేన ఇన్‌చార్జి కణితి కిరణ్‌కుమార్‌, మామిడి రాము, ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రూ.5 కోట్లతో మల్లన్న ఆలయం అభివృద్ధి

టెక్కలి రూరల్‌, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ఎం డల మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరు చేస్తామని మంత్రి అచ్చెన్నాయు డు తెలిపారు. బుధవారం రావివలస ఎండల మల్ల న్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించా రు. కార్తీక మాసం ప్రారంభం కావడంతో భక్తలకు ఎటువంటి ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పోలీసులు, దేవదాయ శాఖ అధికారులు సమన్వయంతో పనులు చేయా లన్నారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో ఎం.కృష ్టమూర్తి, డీఎస్పీ లక్షణరావు, ఈవో గు రునాథరావు, తహసీల్దార్‌ బి.సత్యం, ఎంిపీడీవో రేణుక, టీడీపీ నాయకులు తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 12:40 AM