Share News

రీసర్వేలో తప్పిదాలు జరిగితే చర్యలు: ఆర్డీవో

ABN , Publish Date - May 16 , 2025 | 11:54 PM

గ్రామాల్లో రీసర్వే పక్కాగా జరగాలని, తప్పిదాలు జరిగితే చర్యలు తప్పవని ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి తెలిపారు.

రీసర్వేలో తప్పిదాలు జరిగితే చర్యలు: ఆర్డీవో
టెక్కలి: చిన్నబమ్మిడిలో సర్వేసిబ్బందికి సూచనలు చేస్తున్న ఆర్డీవో కృష్ణమూర్తి

టెక్కలి, మే 16(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో రీసర్వే పక్కాగా జరగాలని, తప్పిదాలు జరిగితే చర్యలు తప్పవని ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి తెలిపారు. శుక్రవారం కోటబొమ్మాళి మండలం లోని బమ్మిడి, చిన్నబమ్మిడి ప్రాంతాల్లో జరుగుతున్న రీసర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు రీసర్వే నోటీసులు అందాయా, లేదా ఆర్డీవో ఆరాతీశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే మామిడి జనార్దనరావు, కోటబొమ్మాళి సర్వేయర్‌ శివరామ్మూర్తి పాల్గొన్నారు.

ఫనరసన్నపేట, మే 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని నడగాంలో రీసర్వేను ఆర్డీవో సాయిప్రత్యూష శుక్రవారం పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఆర్‌. సత్యనారాయణ, ఆర్‌ఐలు సాయిరాం, మండల సర్వేయరు అప్పలస్వామి పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2025 | 11:54 PM