భూసమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలి
ABN , Publish Date - Jul 28 , 2025 | 11:40 PM
రైతులకు భూ సర్వే ద్వారా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ల్యాండ్ సర్వే అడిషనల్ డైరె క్టర్ రోణంకి గోవిందరావు కోరారు.మండలంలోని నారాయణవలసలో ఇటీవల భూ సర్వే జరగడంతో సోమవారం ఏపీ రీ-సర్వే ప్రాజెక్టులో భాగంగా గ్రామసభ నిర్వ హించారు.
కోటబొమ్మాళి, జూలై 28 (ఆంధ్రజ్యోతి): రైతులకు భూ సర్వే ద్వారా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ల్యాండ్ సర్వే అడిషనల్ డైరె క్టర్ రోణంకి గోవిందరావు కోరారు.మండలంలోని నారాయణవలసలో ఇటీవల భూ సర్వే జరగడంతో సోమవారం ఏపీ రీ-సర్వే ప్రాజెక్టులో భాగంగా గ్రామసభ నిర్వ హించారు.ఈసందర్భంగా పలువురు రైతులు తల్లిదండ్రులు పేరుతో పాస్‌పుస్తకాలు కుమారుల పేరున మారడంలేదని, సర్వేనెంబర్లలో ఉన్న తమ భూమి తక్కువగా చూపిస్తోందని పలు సమస్యలను గ్రామస్థులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇటువంటి సమస్యలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామసభలో టెక్కలి ఆర్డీవో ఎన్. కృష్ణమూర్తి, తహసీల్దార్ ఆర్.అప్పలరాజు, ఆర్‌ఐ పవిత్ర పాల్గొన్నారు. అనంతరం ఆయన తన సొంత గ్రామం మండలంలోని గం గరాంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. తాను ఇక్కడే చదువుకున్నానని తెలిపారు.అనంతరం విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు అందజేశారు. ఆయనతో పాటు ఎంఈవో ఎల్వీ ప్రతాప్, గ్రామస్థులు ఉన్నారు.