Share News

కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Dec 27 , 2025 | 11:15 PM

రిమ్స్‌లో పని చేస్తున్న కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడుతున్న కాంట్రాక్టర్లపై చర్య లు తీసుకోవాలని ఇఫ్టూ నాయ కులు డిమాండ్‌ చేశారు.

కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి
నిరసన తెలుపుతున్న సెక్యూరిటీ, పారిశుధ్య కార్మికులు

శ్రీకాకుళం రిమ్స్‌, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): రిమ్స్‌లో పని చేస్తున్న కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడుతున్న కాంట్రాక్టర్లపై చర్య లు తీసుకోవాలని ఇఫ్టూ నాయ కులు డిమాండ్‌ చేశారు. ఈ మేర కు శనివారం రిమ్స్‌ ఎదుట సెక్యూరిటీ, పారిశుధ్య కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భం గా ఇఫ్టూ అధ్యక్షుడు మామిడి క్రాంతి, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాశి గణేష్‌, మాట్లాడుతూ.. గత మూడు నెలలుగా నిబంధనల మేరకు వేతనాలు చెల్లించడం లేదని, పారిశుధ్య కార్మికులను యాజమాన్యాలు వేధిస్తు న్నాయన్నారు. సకాలంలో వేతనం చెల్లించక పోయినా ఉన్నతాధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించాలని కోరు తూ ఆదివారం నుంచి మూడు రోజుల పాటు రిమ్స్‌ గేటు వద్ద రిలే దీక్షలు చేపడుతున్నా మన్నారు. కార్యక్రమంలో సంఘాల ప్రతినిధులు జోగి వెంకట రమణ, రవికుమార్‌, దమ్ము సింహాచలం, సవలాపురపు కృష్ణవేణి, గొల్లపల్లి రాజులు, బగాది శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 11:15 PM