Share News

గ్రామీణ ఉపాధిపై కార్యాచరణ ప్రణాళిక

ABN , Publish Date - Jul 07 , 2025 | 11:40 PM

జిల్లాలో ఆదా య సృష్టి, గ్రామీణ ఉపాధిపై వివిధ శాఖల సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు.

గ్రామీణ ఉపాధిపై కార్యాచరణ ప్రణాళిక
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదా య సృష్టి, గ్రామీణ ఉపాధిపై వివిధ శాఖల సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్‌ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. వ్యవసాయ విస్తరణ, లైవ్‌ స్టాక్‌, గ్రీన్‌ఫీల్డ్‌ అభివృద్ధి, లోన్‌ రికవరీ, రీ పేమెంట్లు, వడ్డీ సబ్సిడీ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించామన్నారు. అన్ని మండలాల్లోనూ మోడల్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని, ఈ గ్రూప్‌లు వ్యవసాయ విస్త రణ, గ్రీన్‌ ఫీల్డ్‌ వంటి అంశాల్లో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. క్రెడిట్‌ లింకేజీపి బలోపేతం చేయాలన్నారు. ఉపాధి, ఆదాయవృద్ధికి ముంద డుగు వేయడమే అంతిమ లక్ష్య మన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌ పృథ్వీరాజ్‌ కుమార్‌, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌ కుమార్‌, డ్వామా పీడీ సుధాకరరావు, పశు సంవర్థక శాఖ జేడీ కె.త్రినాథ్‌, సెరీకల్చర్‌ అధికారి చంద్రజీవన్‌, ఎల్‌డీఎం పి.శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2025 | 11:40 PM